Kalki 2 | గతేడాది విడుదలైన ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించింది. ఇందులో దీపికా పదుకొణె కీలకమైన సుమతి పాత్రలో నటించింది. ‘కల్కి’ విజయంతో సీక్వెల్ ‘కల్కి 2’ కూడా అనౌన్స్ చేశారు. కానీ చిత్ర యూనిట్, దీపికా పదుకొణె మధ్య విభేదాలు తలెత్తడంతో, ఆమెను సీక్వెల్ నుంచి తప్పిస్తున్నట్లు సమాచారం. దీపికా పెట్టిన డిమాండ్లు భరించలేమని వైజయంతి మూవీస్ తేల్చి చెప్పిందని తెలుస్తోంది.
ఇప్పుడామె పాత్రను కొనసాగించాలంటే కొత్త నటి అవసరం. దీంతో సుమతి పాత్రలో ఎవరు నటిస్తారన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ అభిమానులు మాత్రం “అనుష్క శెట్టినే తీసుకోవాలి” అంటున్నారు. ప్రభాస్–అనుష్క జోడీ అంటే బ్లాక్‌బస్టర్ గ్యారెంటీ అన్న నమ్మకం ఉండటంతో, కల్కి 2లో ఈ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ బలంగా డిమాండ్ చేస్తున్నారు. అనుష్కతో పాటు సుమతి పాత్ర కోసం నయనతార, సమంత, అలియా భట్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఎవరు ఫైనల్ అవుతారన్నది త్వరలోనే తెలిసే అవకాశముంది.
మొత్తానికి, ‘కల్కి 2’లో హీరో ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసేది ఎవరో తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కల్కి చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో ప్రభాస్, దీపికా, అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖులు నటించి అలరించారు. కమల్ హాసన్ నెగెటివ్ రోల్లో నటించి అలరించారు. ఇక సెకండ్ పార్ట్‌లో ఆయన పాత్రకి మరింత ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. కల్కి చిత్రం పెద్ద విజయం సాధించడంతో కల్కి 2 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అని జోస్యాలు చెబుతున్నారు.