Actress | పాకిస్తాన్ ప్రముఖ నటి జవేరియా అబ్బాసీ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వివాదాలకే కేంద్రబిందువుగా నిలుస్తుంది. బాల్యంలోనే వివాహం, ఆ తర్వాత విడాకులు, ఇప్పుడు రెండో పెళ్లి ..ఇవన్నీ కలిపి చూస్తే ఆమె లైఫ్ ఒక సినీ కథలా మారిపోయింది అని అంటున్నారు. 1997లో కేవలం 17 ఏళ్ల వయసులోనే జవేరియా తన సవతి సోదరుడు షమూన్ ను వివాహం చేసుకోవడం ఆ సమయంలో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ వివాహంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొంతమంది వారు బయోలాజికల్ సోదర–సోదరీమణులు కాదని సమర్థించినా, సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
ఈ వివాహ జీవితం ఎక్కువ కాలం నిలవలేదు. జవేరియా–షమూన్లకు అంజెలా అనే కుమార్తె పుట్టగా, తర్వాత వీరిద్దరూ విడిపోయారు. అప్పటి నుండి జవేరియా సింగిల్ మదర్‌గా తన కూతురిని పెంచుతూ జీవితం కొనసాగించారు. ఒక ఇంటర్వ్యూలో జవేరియా మాట్లాడుతూ.. “సొంత తల్లి అత్తగా మారి నాపై కఠినంగా వ్యవహరించింది. సమాజం కోసం మంచి కోడలిగా ఉండాలని ప్రయత్నించాను. కానీ వచ్చిన విమర్శలు తట్టుకోలేక చివరికి విడాకులు తీసుకోవాల్సి వచ్చింది” అని చెప్పింది. ఇక తాజాగా, 51 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకోవడం ద్వారా జవేరియా మళ్లీ వార్తల్లో నిలిచింది.
2024లో వ్యాపారవేత్త అడీల్ హైదర్ ను ఆమె రెండో వివాహం చేసుకుంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం తన కుమార్తె అంజెలా ఇచ్చిన ప్రోత్సాహమేనని తెలిపింది. రెండో వివాహంపై కూడా విమర్శలు ఎదుర్కొన్నా, ఈసారి భర్త కుటుంబం మరియు అభిమానుల మద్దతుతో సంతోషంగా జీవిస్తున్నానని జవేరియా వెల్లడించింది. ఇన్ని సంవత్సరాలు ఒంటరిగా పోరాడిన జవేరియా, ఇప్పుడు తల్లి, భార్య, కోడలిగా తన జీవితాన్ని పూర్తి అయిందన్న భావనలో ఉంది. బాల్యంలో చేసుకున్న వివాహం, చిన్న వయసులో తల్లిగా మారడం, తర్వాత విడాకులు, ఇప్పుడు ఆలస్యంగా మళ్లీ పెళ్లి అన్నీ కలిపి ఆమె జీవితం నిజంగా ఒక కలలాగానే అనిపిస్తోంది అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.