Number Plate Tampering | నెంబర్ ప్లేట్లు ట్యాంపరింగ్ చేస్తే క్రిమినల్ కేసులు పెడతాం.. జోయల్ డేవిస్ వార్నింగ్
Number Plate Tampering | వాహనాల నెంబర్ ప్లేట్లను మార్చడం లేదా ట్యాంపరింగ్‌కు పాల్పడడం తీవ్రమైన నేరమని, అటువంటి వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ హెచ్చరించారు.
Number Plate Tampering | సిటీబ్యూరో/మలక్ పేట్ . ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): వాహనాల నెంబర్ ప్లేట్లను మార్చడం లేదా ట్యాంపరింగ్‌కు పాల్పడడం తీవ్రమైన నేరమని, అటువంటి వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ హెచ్చరించారు. నంబర్ ప్లేట్ మార్చి ఇతర వాహనదారుడిని ఇబ్బందులకు గురిచేస్తున్న ఒక వ్యక్తిని చాదర్‌ఘాట్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
మలక్‌పేటకు చెందిన సయ్యద్ అలీవుద్దీన్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనం అసలు నంబర్ టీఎస్11ఈజెడ్2936 ను కావాలనే టీఎస్11ఈజెడ్2836 మార్చి వాడుతున్నారని, ఈ క్రమంలో అసలైన వాహన యజమాని ఫహీమ్అలీ తన వాహనంపై వరుసగా ట్రాఫిక్ చలాన్లు వస్తున్నాయంటూ ఫిర్యాదు చేయడంతో ఈ మోసం బయటపడిందని తెలిపారు.
నిందితుడు చేసిన ఉల్లంఘనల వల్ల అసలు యజమాని వాహనంపై 23 తప్పుడు చలాన్లు నమోదయ్యాయని, నిందితుడిపై చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారని తెలిపారు. నగరంలోని సీసీటీవీ, ఏఎన్పీఆర్ కెమెరాల ద్వారా ఇటువంటి ట్యాంపరింగ్ కేసులను సులభంగా గుర్తిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. తప్పుడు నంబర్ ప్లేట్లు వాడటం చట్టరీత్యానేరమని, ఉల్లంఘనలకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని జోయల్ డేవిస్ స్పష్టంచేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

