వాషింగ్టన్: పాత దోస్తులు (Former First Buddy) మళ్లీ కలిశారు. ఓ స్మాకర కార్యక్రమంలో పక్కపక్కనే కూర్చుని సీరియస్‌గా చర్చించుకున్నారు. వాళ్లే ట్రంప్ (Donald Trump), ఎలాన్ మస్క్ (Elon Musk). రెండు వారాల క్రితం దారుణ హత్యకు గురైన కన్జర్వేటివ్ పార్టీ కార్యకర్త, ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ (Charlie Kirk) స్మారకార్థం ఆరిజోనాలోని ఓ స్టేడియంలో కార్యక్రమం నిర్వహించారు. దీనికి పాత మిత్రులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ హాజరయ్యారు. ఇరువురు పక్కపక్క కుర్చీల్లోనే కూర్చున్నారు. షేక్‌హ్యండ్ ఇచ్చుకున్నారు. ఇరువురూ కాసేపు చర్చించుకున్నారు.
ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ప్రభుత్వంలో ఖర్చులు తగ్గించేందుకు డోజ్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దానికి టెస్లా సీఈవో మస్క్‌ను చీఫ్‌గా నియమించారు. అయితే కొన్ని నెలలకే ఇరువురి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో మే 29న మస్క్ ఆ పదవి నుంచి తప్పుకున్నారు. తర్వాత పాత మిత్రులు మళ్లీ కలవడం ఇదే తొలిసారి. దీనికి సంబంధించిన ఫొటోను ఎలాన్ మస్క్.. ‘ఫర్ చార్లీ’ అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. దీనికి వైట్ హౌస్ కూడా స్పందించింది.
ఈ నెల 10న ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్‌ను.. ఉటా రాష్ట్రంలోని ఉటా వేలీ యూనివర్సిటీలో జరుగుతున్న కార్యక్రమంలో ఒక దుండగుడు కాల్చి చంపిన విషయం తెలిసిందే. మాస్ షూటింగ్‌పై జరిపిన చర్చా కార్యక్రమంలోనే ఆయనను కాల్చి చంపారు. సమీప భవనం పై కప్పు నుంచి జరిపిన ఒక రౌండ్ కాల్పుల్లో చార్లీ మెడపై తీవ్ర గాయం కావడంతో ఆయనను దవాఖానకు తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మరణించారు.
కిర్క్ మొదటి నుంచి భారతీయ వ్యతిరేకిగా గుర్తింపు పొందాడు. భారతీయులకు వీసాలు ఇవ్వొద్దని ఆయన ఇటీవల ప్రచారం చేశారు. మే 8న జరిగిన ఒక పాడ్‌కాస్ట్‌లో కిర్క్ మాట్లాడుతూ భారత వలసవాదులపై బహిరంగంగానే ధ్వజమెత్తారు. భారత్-పాక్ మధ్య జరుగుతున్న ఆపరేషన్ సిందూర్‌ను ఆపాలని ట్రంప్‌ను కోరారు. బిన్ లాడెన్‌కు ఆశ్రయమిచ్చిన పాకిస్థాన్ మోసపూరితమైనదని, ఇస్లామిక్ ఉగ్రవాదంపై పోరు జరుపుతున్న భారత్‌కు యూఎస్ కొద్దిగా మద్దతు తెలపవచ్చని, కానీ అది నైతిక మద్దతు కంటే ఎక్కువ ఉండరాదని అన్నారు.
For Charlie pic.twitter.com/8092jIt319
— Elon Musk (@elonmusk) September 21, 2025
POTUS x @ElonMusk
For Charlie. pic.twitter.com/Inaf8X81Gy
— The White House (@WhiteHouse) September 22, 2025
Love to see it. 🤝pic.twitter.com/pz2ynCuQj5
— Western Lensman (@WesternLensman) September 21, 2025