Rithu Chowdary | ప్రముఖ కామెడీ షో ‘జబర్దస్త్’ ద్వారా గుర్తింపు పొందిన తరువాత బిగ్బాస్ తెలుగు సీజన్ 9 లో పాల్గొన్న నటి రీతూ చౌదరి మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. ఆమెకు సంబంధించి కొన్ని ప్రైవేట్ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు గౌతమి అనే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా విడుదల చేయడంతో, ఇది పెద్ద దుమారానికి దారి తీస్తోంది. గౌతమి ఇటీవలే తన భర్త, టాలీవుడ్ నటుడు ధర్మ మహేష్ తనను కట్నం కోసం వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో తన భర్త ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని చెప్పింది తప్ప ఆమె ఎవరు అనేది చెప్పలేదు.
అయితే తాజాగా గౌతమి .. రీతూ చౌదరి పేరు, ఫోటోలు, వీడియోలు బయట పెట్టింది. ఈ వీడియోలలో ధర్మ మహేష్, రీతూ కలిసి ఒక ఫ్లాట్లోకి వెళ్లిన దృశ్యాలు ఉన్నాయి. అలాగే వారి మధ్య చాట్ స్క్రీన్షాట్లు, వ్యక్తిగత క్షణాలు కూడా కనిపిస్తున్నాయి. దీని ద్వారా వీరిద్దరి మధ్య సంభందం ఉందన్నదే అర్థమవుతుంది.ఈ వీడియోలు చూసిన నెటిజన్లు, అభిమానులు షాక్ అయ్యారు.”పద్దతిగా కనిపించే రీతూ ఇలా చేస్తుందనుకోలేదు”, “ఇది నిజమైతే చాలా విచారకరం” అంటూ అనేక కామెంట్లు వస్తున్నాయి. కొందరేమో గౌతమికి మద్దతు తెలుపుతూ, ఆమె ధైర్యాన్ని అభినందిస్తున్నారు.
ధర్మ మహేష్, “సింధూరం”, “డ్రింకర్ సాయి” వంటి సినిమాల్లో హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2019లో గౌతమిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.2023లో ఈ జంటకు బాబు జన్మించాడు.అయితే ఇటీవల అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని గౌతమి ఫిర్యాదు చేసింది.ఇప్పుడు ఆమె విడుదల చేసిన వీడియోలు, ఫోటోలు కేసును మరో మలుపు తిప్పే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వీరి గురించే చర్చ నడుస్తుంది. రీతూ, ధర్మ మహేష్ నిజంగా రిలేషన్షిప్లో ఉన్నారా? లేక కేవలం డ్రగ్స్ వంటివి తీసుకునే క్రమంలో కలిసారా? అనే అనుమానాలు కూడా కొందరిని ఆలోజింపచేస్తున్నాయి. పోలీసులు ఈ అంశాన్ని దర్యాప్తు చేసే అవకాశం ఉంది. కాగా, రీతూ చౌదరి ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9లో సందడి చేస్తున్నారు.