Aditya Dhar | భారతీయ సినీ పరిశ్రమలో సరికొత్త రికార్డులను లిఖించిన ‘ధురంధర్’ చిత్ర సృష్టికర్త ఆదిత్య ధర్ తాజాగా తన అభిమానులను ఉద్దేశించి ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైన మొదటి భాగం ‘ధురంధర్’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 1,400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి, భారతీయ సినిమా సత్తాను చాటిన ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరినీ ఆయన తన ‘ధురంధర్ కుటుంబం’గా సంబోధిస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా కేవలం వెండితెరపై మెరిసే బొమ్మలా కాకుండా, ప్రతి భారతీయుడు తన సొంతం చేసుకున్న ఒక గొప్ప భావోద్వేగంగా మారిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
రేపు (మార్చి 19న) ఈ చిత్ర సీక్వెల్ ‘ధురంధర్: ది రివెంజ్’ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ బహిరంగా లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆయన ప్రేక్షకులకు ఒక వినూత్నమైన విజ్ఞప్తి చేశారు. సినిమాలోని అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను, భావోద్వేగాలను కేవలం మొబైల్ ఫోన్లలోనో లేదా పైరసీ వెర్షన్లలోనో చూసి ఆ మ్యాజిక్‌ను పాడుచేసుకోవద్దని ఆయన కోరారు. థియేటర్లలోని భారీ స్క్రీన్‌పై, చీకటి గదిలో అందరితో కలిసి అనుభవించినప్పుడే ఆ సినిమాలోని అసలైన థ్రిల్ లభిస్తుందని, ఆ అనుభూతి కోసమే తమ చిత్ర బృందం నిద్రలేని రాత్రులు శ్రమించిందని వెల్లడించారు.
ముఖ్యంగా ఈ రెండో భాగంలో ప్రేక్షకులు అస్సలు ఊహించని ఎన్నో మలుపులు, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయని ఆదిత్య ధర్ పేర్కొన్నారు. సినిమా చూసిన వారు దయచేసి కథలోని రహస్యాలను లేదా ‘స్పాయిలర్స్’ను సోషల్ మీడియాలో గానీ, బయట గానీ ఎవరితోనూ పంచుకోవద్దని ఆయన వేడుకున్నారు. ప్రతి ప్రేక్షకుడు ఏమీ తెలియని ఒక కుతూహలంతో థియేటర్లోకి అడుగుపెట్టి, సినిమా ముగిశాక ఒక గొప్ప అనుభూతితో బయటకు రావాలని ఆయన ఆకాంక్షించారు. రణవీర్ సింగ్, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి అగ్ర తారలతో దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ స్పై యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. చివరిగా “భారత్ మాతా కీ జై” అంటూ ఆదిత్య ధర్ తన లేఖను ముగించాడు.
🙏🧿♥️#DhurandharTheRevenge releases worldwide on 19 March, on Gudi Padwa, Ugadi, and Eid.
Hindi | Telugu | Tamil | Kannada | Malayalam @ranveersingh @rampal72 @duttsanjay @actormaddy #AkshayeKhanna @saraarjunn @therakeshbedi @adityadharfilms #JyotiDeshpande @dhar_lokesh… pic.twitter.com/wgO61vrUUQ
— Aditya Dhar (@AdityaDharFilms) March 18, 2026