హైదరాబాద్ : ప్రైవేట్ బస్సులో(Private bus) గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మీర్జా ఫయాజ్ అలీ అనే వ్యక్తి నుంచి రెండు కిలోల ఎండు గంజాయిని(Ganja) స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సుచిత్ర సెంటర్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా ఫయాజ్ నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు నిందితుడు అంగీరకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా గంజాయి అమ్మినా కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
OTT Releases This Weekend | వీకెండ్ వినోదం: ఈ వారం ఓటీటీలో విడుదలైన చిత్రాలివే!
Prabhas | జపాన్ ‘అనన్’ మ్యాగజైన్ కవర్ పేజ్‌పై ప్రభాస్ .. అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం