Prabhas | జపాన్ ‘అనన్’ మ్యాగజైన్ కవర్ పేజ్‌పై ప్రభాస్ .. అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం
Prabhas | టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ రోజు రోజుకీ ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరిస్తోంది. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందిన ఆయన, ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపైనా తన ముద్రను బలంగా వేస్తున్నారు.
Prabhas | టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ రోజు రోజుకీ ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరిస్తోంది. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందిన ఆయన, ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపైనా తన ముద్రను బలంగా వేస్తున్నారు. తాజాగా జపాన్‌కు చెందిన ప్రముఖ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ ‘అనన్’ (Anan) కవర్ పేజీపై ప్రభాస్ కనిపించడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ఫిబ్రవరి 10న విడుదల కానున్న ఈ మ్యాగజైన్ 2483వ సంచిక బ్యాక్ కవర్‌పై ప్రభాస్ ప్రత్యేకంగా చోటు సంపాదించటం విశేషం. ఈ గౌరవం సాధించిన మొట్టమొదటి భారతీయ నటుడిగా ప్రభాస్ రికార్డు సృష్టించారు. గతంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సంచలన విజయం తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఈ మ్యాగజైన్ కవర్‌పై కనిపించిన విషయం తెలిసిందే.
అయితే, ఒక భారతీయ హీరో సోలోగా అనన్ కవర్‌పై మెరవడం మాత్రం ప్రభాస్‌తోనే మొదలైంది. దీంతో ఆయన అంతర్జాతీయ ఫ్యాన్ బేస్ ఎంత బలంగా ఉందో మరోసారి రుజువైంది. ఈ సంచికకు “Irresistible Feelings” అనే ప్రత్యేక థీమ్‌ను ఎంచుకోగా, అందులో ప్రభాస్‌ను “Royal Audience Gravure” అని అభివర్ణించడం అభిమానులను మరింత గర్వపడేలా చేసింది. ఆయన వ్యక్తిత్వం, స్టైలిష్ లుక్, గంభీరమైన ఆరా ఈ ఫోటోషూట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మ్యాగజైన్ డిజైన్‌లో ప్రభాస్‌కు ఇచ్చిన ప్రాధాన్యం ఆయన గ్లోబల్ ఇమేజ్ను ప్రతిబింబిస్తోంది. డిసెంబర్ 2025లో తన సినిమాల ప్రమోషన్ నిమిత్తం ప్రభాస్ టోక్యో పర్యటనకు వెళ్లిన సమయంలో ఈ ఫోటోషూట్ నిర్వహించినట్లు సమాచారం. అప్పటినుంచే జపాన్ మీడియాలో ఆయనపై ప్రత్యేక కథనాలు వెలువడుతుండగా, ఇప్పుడు అనన్ మ్యాగజైన్ కవర్‌తో ఆ ఆసక్తి మరింత పెరిగింది. జపాన్‌లో ప్రభాస్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, ముఖ్యంగా ‘బాహుబలి’ తర్వాత ఏర్పడిన ఆదరణ, ఈ గుర్తింపుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
ఈ వార్త బయటకు రాగానే సోషల్ మీడియా వేదికలపై ప్రభాస్ అభిమానులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. #PrabhasOnAnan, #GlobalStarPrabhas వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తన క్రేజ్‌ను విస్తరించుకుంటూ, ప్రభాస్ మరోసారి భారతీయ సినిమాకు గ్లోబల్ స్థాయిలో గౌరవం తీసుకొచ్చాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

