ఫ్యామిలీ కోసంపోరాటం పరిమళ అండ్-కో
మధ్యతరగతి కుటుంబాలు; పరువు-ప్రతిష్ఠలు; డబ్బు, అధికారం ఉన్నవారితో ఎదురయ్యే సమస్యలు.. ఇవన్నీ భారతీయ సినిమాకు పునాది రాళ్లు. కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగించే తల్లిదండ్రుల కథలెన్నో తెరకెక్కాయి.
జీ5: స్ట్రీమింగ్ అవుతున్నది.
తారాగణం: జయరాం, సంతోష్ శోభన్, ఊర్వశి, అనంతిక సనీల్ కుమార్, సంజనా కృష్ణమూర్తి, యోగిబాబు తదితరులు
దర్శకత్వం: పాండిరాజ్
మధ్యతరగతి కుటుంబాలు; పరువు-ప్రతిష్ఠలు; డబ్బు, అధికారం ఉన్నవారితో ఎదురయ్యే సమస్యలు.. ఇవన్నీ భారతీయ సినిమాకు పునాది రాళ్లు. కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగించే తల్లిదండ్రుల కథలెన్నో తెరకెక్కాయి. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన భాషల్లో రీమేక్ అయిన ‘దృశ్యం’ కూడా ఈ జోనర్ సినిమానే! నిజానికి ‘పరిమళ అండ్-కో’లో అడుగడుగునా ‘దృశ్యం’ దృశ్యాలే మదిలోకి వస్తాయి. అయితే, ‘దృశ్యం’ సీరియస్‌గా సాగే కథ అయితే..
‘పరిమళ’కు కాస్త కామెడీ టచ్ ఇచ్చాడు దర్శకుడు పాండిరాజ్. అదే సమయంలో ఫ్యామిలీ ఎమోషన్స్‌ను పండిస్తూనే.. చివరివరకూ సస్పెన్స్‌నూ నడిపించాడు. ‘పరిమళ’ ఫ్యామిలీపై ఓ లుక్కేస్తే.. పరిమళ (జయరామ్)ది అందమైన, మధ్యతరగతి కుటుంబం. భార్య స్వరాజ్యం (ఊర్వశి), కూతుళ్లు పరాశక్తి (సంజనా కృష్ణమూర్తి), మధుమిత (అనంతిక)తో కలిసి నగరంలో నివసిస్తూ ఉంటాడు. అద్దె ఇంట్లో ఉంటూ.. సంసారాన్ని చాలా పొదుపుగా నెట్టుకొస్తుంటాడు. ఇలా ఉండగా, అదే సిటీలో వర్గీస్ (శాండీ) అనే జులాయి.. కాలేజీ కుర్రాళ్లకు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తుంటాడు. హత్యలు చేయడానికి కూడా ఏమాత్రం వెనుకాడడు. దాంతో, అతనంటే స్థానికులంతా భయపడుతుంటారు.
వర్గీస్‌కు రాజకీయ అండదండలు ఉండటంతో పోలీసులు కూడా చూసీచూడనట్లే వ్యవహరిస్తుంటారు. అలాంటి వర్గీస్.. మధుమితను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతాడు. పరిమళతోపాటు అతని కూతుళ్లు ఎంత మందలించినా వినిపించుకోడు. అదే ఏరియాలో దందాలు చేసే వర్గీస్ తల్లి కూడా.. మధుమిత విషయంలో కొడుక్కు సపోర్ట్ చేస్తుంది. దాంతో.. వర్గీస్ చనిపోతేనే తాము ప్రశాంతంగా బతకగలమని పరిమళ భావిస్తాడు.
కుటుంబ సభ్యులకు ఈ విషయం చెబితే.. వారుకూడా మద్దతు తెలుపుతారు. మరోవైపు పరాశక్తి.. చిట్టీ (సంతోష్ శోభన్)ను ప్రేమిస్తూ ఉంటుంది. వర్గీస్ విషయంలో తమ కుటుంబం తీసుకున్న నిర్ణయాన్ని చిట్టీతో చెబుతుంది. అయితే, ఆ మరుసటి రోజే వర్గీస్ దారుణంగా హత్యకు గురవుతాడు. పరిమళ ఇంటి పరసరాల్లోనే వర్గీస్ శవం దొరుకుతుంది. అలా పరిమళ ఫ్యామిలీ.. హత్య కేసులో చిక్కుకుంటుంది. దాంతో, వారికోసం ఓ వైపు పోలీసులు గాలిస్తుంటారు.
మరోవైపు.. తన కొడుకు చనిపోవడానికి పరిమళ ఫ్యామిలీనే కారణమని సురేఖావాణి కూడా వారిపై పగ పెంచుకుంటుంది. తన అనుచరులతో కలిసి వారిని వెతుకుతుంటుంది. ఈ క్రమంలో తన కుటుంబం ప్రమాదంలో పడుతుందని గ్రహించిన పరిమళ ఏం చేస్తాడు? అతని నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అసలు వర్గీస్‌ను హత్య చేసింది ఎవరు? చివరికి హత్యకేసు నుంచి పరిమళ ఫ్యామిలీ బయటపడుతుందా? అనేది మిగతా కథ.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

