OTT Releases This Weekend | ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాల సందడి లేకపోగా చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేస్తున్నాయి. అయితే ఈ వీకెండ్ ఓటీటీలో మాత్రం వినోదాల జాతర మొదలైంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ తో పాటు శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి ఆసక్తికర చిత్రాలు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం డిజిటల్ వేదికగా వచ్చిన సినిమాలను చూసుకుంటే.!
జియో హాట్‌స్టార్
ది రాజా సాబ్: ప్రభాస్ హీరోగా నటించిన ఈ హారర్-కామెడీ చిత్రం ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో).
కిస్ కిస్కో ప్యార్ కరూన్ 2: కపిల్ శర్మ నటించిన హిందీ కామెడీ సినిమా.
నెట్‌ఫ్లిక్స్
ది లింకన్ లాయర్ – సీజన్ 4: పాపులర్ ఇంగ్లీష్ లీగల్ డ్రామా సిరీస్ (హిందీలో కూడా అందుబాటులో ఉంది).
ట్రాన్స్ఫార్మర్స్ వన్: ఇంగ్లీష్ యానిమేషన్ యాక్షన్ మూవీ.
క్వీన్ ఆఫ్ చెస్: ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.
ఈవెన్ ఇఫ్ దిస్ లవ్ డిసప్పియర్స్ టునైట్: కొరియన్ రొమాంటిక్ డ్రామా (తెలుగు, తమిళ, హిందీ భాషల్లో).
డెత్ విస్పరర్ 3: థాయ్ హారర్ చిత్రం.
ఇస్ ఇట్ కేక్? వాలెంటైన్స్: ఇంగ్లీష్, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ లూసీ లెట్బీ: డాక్యుమెంటరీ (తెలుగు, తమిళ, హిందీ భాషల్లో).
అన్ ఫెమిలియర్: జర్మన్ స్పై థ్రిల్లర్ సిరీస్ (తెలుగు, తమిళ, హిందీలో).
అమెజాన్ ప్రైమ్ వీడియో
నారీ నారీ నడుమ మురారి: శర్వానంద్ నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం (తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ).
రిలేషన్షిప్ గోల్స్: ఇంగ్లీష్ సినిమా.
గన్స్ అప్: ఇంగ్లీష్, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో లభ్యం.
ది హౌస్‌మెయిడ్, ది డచ్మెన్, హ్యామ్‌నెట్, ది ప్లేగ్, వి బరీ ది డెడ్ వంటి చిత్రాలు ప్రస్తుతం అద్దె పద్ధతిలో అందుబాటులో ఉన్నాయి.
జీ5
పరాశక్తి: శివకార్తికేయన్ నటించిన ఈ పీరియడ్ డ్రామా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది.
శబ్ద: రీత్ ఔర్ రివాజ్: హిందీ ఫ్యామిలీ డ్రామా సిరీస్.
నెల్లిక్కాంపొయిల్ నైట్ రైడర్స్: మలయాళ హారర్ కామెడీ.
జై: కన్నడ పొలిటికల్ డ్రామా.
ఆహా వీడియో
సైక్ సిద్ధార్థ: తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ.
సన్ నెక్స్ట్
నీలకంఠ: మాస్టర్ మహేంద్రన్ నటించిన యాక్షన్ డ్రామా (తెలుగు, తమిళ భాషల్లో).
మిండియుమ్ పరంజుమ్: మలయాళ రొమాంటిక్ డ్రామా.
ఇతర ప్లాట్‌ఫారమ్‌లు
లయన్స్ గేట్ ప్లే: మాతృ – తెలుగు చిత్రం.
హులు: ఎల్లా మెక్కే, స్ప్లిట్స్‌విల్లే.
హెచ్బిఓ మాక్స్: బాయ్స్ గోటు జూపిటర్.
ముబి: లా గ్రాజియా.
టెంట్ కొట్టా: ఐపీఎల్: ఇండియన్ పీనల్ లా – తమిళ చిత్రం.