IFTU | జవహర్నగర్, జూన్ 3: 16 నెలలు గడుస్తున్నా ఉద్యమ కారుల సంక్షేమ బోర్డు ఏదని ఐఎఫ్టీయూ జాతీయ కన్వీనర్ షేక్షావలి ప్రభుత్వాన్నిప్రశ్నించారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో తెలంగాణ కోసం పోరాడి అమరులైన ఉద్యమకారులను, వారి కుటుంబాలను సీఎం రేవంత్రెడ్డి విస్మరించడాన్నితీవ్ర ఖండిస్తున్నామని మంగళవారం షేక్షావలి ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఎన్నికల హామీలుగానే మిగిలాయని, సీఎం రేవంత్రెడ్డి ద్వందనీతిని అనుసరిస్తున్నారని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి తమ అనునాయూలకే నగదు పురస్కారాలు, సంక్షేమ ఫలాలను అందజేస్తూ మలి, తొలిదశ ఉద్యమకారుల త్యాగాలను, న్యాయమైన గుర్తింపును ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఉద్యోగుల సంక్షేమ బోర్డును ప్రభుత్వం ప్రకటిస్తుందని ఆశగా ఎదురుచూసినా అడియాశలే మిగిలాయన్నారు. దోపీడి, అసమానతలను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి పోషిస్తుందని గుర్తు చేశారు.
కవులు, కళాకారుల పేరున కోటి రూపాయల నగదు పురస్కారాలు అందుకున్న వారైన ఉద్యమకారుల పట్ల మాట్లాడకపోవడం వారి నైతికతకు నిదర్శనమన్నారు. ఉద్యమకారులు సంఘటితంగా పోరాడి తమ హక్కులను సాధించుకోవాలని షేక్షావలి విజ్ఞప్తి చేశారు.
Crocodile | గద్వాలలో అర్ధరాత్రి కలకలం.. ఇండ్ల మధ్యకు వచ్చిన మొసలి
Electric Vehicles | రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు.. రెండు లక్షలు దాటిన ఈవీలు
Mongolia | విశ్వాసం కోల్పోయి.. మంగోలియా ప్రధాని రాజీనామా