Rajakas | రామంతాపూర్, జూన్ 14: రజక వృత్తిదారులపై కరంటోళ్ల బెదిరింపులు ఆపాలని మేడ్చల్ జిల్లా రజక సంఘం గౌరవాధ్యక్షుడు అంబటి చక్రపాణి, ప్రధాన కార్యదర్శి జ్యోతి ఉపేందర్ పేర్కొన్నారు. శనివారం నాచారంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ధర్నా కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇందిరాపార్కు వద్ద నిర్వహించ తలపెట్టిన ధర్నాకు రజకులు పెద్దెత్తున తరలి రావాలన్నారు.
గత ప్రభుత్వం ఇచ్చిన ఉచిత విద్యుత్ ఫథకం బిల్లులు 15 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. కరంటోళ్లు రజకులను బెదిరిస్తున్నారన్నారు. రజకులకు ధోభీ ఘాట్లు, స్థలాలు , కమ్యూనిటీ హాల్ కేటాయించాలన్నారు. ప్రభుత్వం చేనేత, గీత కార్మికులకు ఇచ్చినట్లు రజకులకు పెన్షన్ ఇవ్వాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సర్ధార్,అశోక్ రెడ్డి, రాజులు, నర్సయ్య, భాస్కర్, బాలచందర్, మైసయ్య, బాలరాజు, శ్యామ్, శ్రీనివాస్, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
Read Also :
కుట్రతోనే కేటీఆర్‌కు నోటీసులు.. ఎక్స్ వేదికగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కాంగ్రెస్‌వి డైవర్షన్ రాజకీయాలు.. మధుసూదనాచారి
Kaleru Venkatesh | పేదలకు ఆపత్కాలంలో ఆర్థిక చేయూత ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్