Kaleru Venkatesh | గోల్నాక, జూన్ 14: పేదలకు అపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక చేయూత అందిస్తోందని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శనివారం గోల్నాక క్యాంపు కార్యాయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన 35 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.14.90లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ.. వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రతి ఏటా సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూత అందించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో వేలాది మంది పేదలకు వైద్య సేవలకు సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు అందించినట్లు తెలిపారు.