హైదరాబాద్ జూన్ 13 (నమస్తేతెలంగాణ): పాలన చేతగాకే కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ రాజకీయాలకు తెరలేపిందని మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై అడుగడుగునా నిలదీస్తున్న కేటీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కొలేకే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏసీబీ నోటీసుల పేరిట ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నదని విమర్శించారు.
కాంగ్రెస్ హామీల అమలును అటకెక్కించిన సర్కారు.. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలను కేసుల పేరిట ఇక్కట్ల పాల్జేయాలని చూడటం దుర్మార్గమని పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజల తరఫున బీఆర్ఎస్ పోరాటాన్ని ఆపబోదని తేల్చిచెప్పారు.