ఆసీస్ క్లీన్‌స్వీప్.. మూడో వన్డేలోనూ ఓడిన భారత్
స్వదేశంలో భారత్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. వరల్డ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం వరుసగా మూడో వన్డేలోనూ ఓడి దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది.
- సెంచరీతో కెరీర్‌ను ముగించిన హీలి
హోబర్ట్ : స్వదేశంలో భారత్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. వరల్డ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం వరుసగా మూడో వన్డేలోనూ ఓడి దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. తన కెరీర్లో చివరి మ్యాచ్ ఆడిన ఆసీస్ సారథి అలిస్సా హీలి (98 బంతుల్లో 158, 27 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ శతకంతో రాణించగా బెత్ మూనీ (84 బంతుల్లో 106 నాటౌట్, 10 ఫోర్లు, 1 సిక్స్), జార్జియా వోల్ (62) రాణించారు. ఫలితంగా ఆ జట్టు 50 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 409 పరుగుల రికార్డు స్కోరు సాధించింది.
బౌండరీల వర్షం కురిపించిన హీలి.. వోల్, మూనీతో కలిసి శతాధిక భాగస్వామ్యాలు నెలకొల్పడంతో ఆ జట్టు ప్రత్యర్థి ఎదుట భారీ లక్ష్యాన్ని నిలుపగలిగింది. లక్ష్య ఛేదనలో భారత జట్టు ఏ దశలోనూ ఆ దిశగా సాగలేదు. మరోసారి బ్యాటింగ్ వైఫల్యంతో 45.1 ఓవర్లలో 224 రన్స్‌కే కుప్పకూలి 185 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది. స్నేహ్ రాణా (44), జెమీమా రోడ్రిగ్స్ (42) ఉన్నంతలో కాస్త ఫర్వాలేదనిపించారు. వన్డే సిరీస్ ముగియడంతో ఇరుజట్ల మధ్య ఈనెల 6 నుంచి పెర్త్‌లో ఏకైక టెస్టు జరుగనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

