సింధు.. భయం భయంగా!
ఈనెల 3 నుంచి బ్రిటన్‌లో మొదలుకాబోయే ఆల్‌ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ ఆడేందుకు గాను లండన్‌కు పయనమైన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు.. దుబాయ్ విమానాశ్రయంలోనే ఆగిపోయింది. దుబాయ్‌లో అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులను ప్రయోగిస్తున్న వేళ..
దుబాయ్ : ఈనెల 3 నుంచి బ్రిటన్‌లో మొదలుకాబోయే ఆల్‌ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ ఆడేందుకు గాను లండన్‌కు పయనమైన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు.. దుబాయ్ విమానాశ్రయంలోనే ఆగిపోయింది. దుబాయ్‌లో అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులను ప్రయోగిస్తున్న వేళ.. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో తాత్కాలికంగా అన్ని సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న సింధు.. విమానాశ్రయానికి చేరువలోనే తమకు పెద్ద పేలుడు శబ్దం వినిపించడమే గాక దట్టమైన పొగ వ్యాపించడంతో తాము అక్కడ్నుంచి పరుగులు తీశామని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన వీడియోలో పేర్కొంది.
‘కొన్ని గంటల క్రితం మేం ఉన్న ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో భారీ పేలుడు సంభవించింది. నా కోచ్, సహాయక సిబ్బంది అక్కడ్నుంచి హుటాహుటిన పరుగులు తీశాం. అది మా అందరికీ భయానక క్షణం’ అని తెలిపింది. అయితే ఇది జరిగిన కొద్దిసేపటికే దుబాయ్ విమానాశ్రయ అధికారులు, తమను సురక్షిత ప్రాంతానికి తరలించారని, తాము క్షేమంగా ఉన్నామని వీడియోలో పేర్కొంది. ఈ సందర్భంగా ఆమె విమానాశ్రయ అధికారులు, దుబాయ్‌లోని భారత హైకమిషన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

