హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): రాజకీయ కుట్రలో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్ సర్కారు మళ్లీ నోటీసులు ఇచ్చిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని శుక్రవారం ఎక్స్ వేదికగా ఆమె తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పాలకులు ఎన్ని కుట్రలు పన్నినా.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కారు కుట్రలు మాని ప్రజాసమస్యలపై దృష్టిపెట్టాలని అన్నారు.
హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : ఫార్ములా ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఖండించారు. ఏసీబీ ద్వారా మరోసారి నోటీసులు జారీ చేయించడం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సరార్ వైఫల్యాలను ఎండగతున్నందుకు కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చిందని స్పష్టంగా తెలుస్తున్నదన్నారు.
పాలనా వైఫల్యాలు, ఇచ్చిన హామీల నుంచి దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ సర్కారు కేటీఆర్‌పై ఏసీబీ కేసు పేరిట నాటకానికి తెరలేపిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఒక ప్రకటనలో విమర్శించారు. ఫా ర్ములా-ఈ రేస్ కేసులో ఇప్పటికే సుదీర్ఘంగా విచారించిన అవినితీ నిరోధక శాఖ అధికారులు మళ్లీ నోటీసులు ఇవ్వడంలోని అంతర్యమేమిటని ప్రశ్నించారు. ఫార్ములా-ఈ తెచ్చి తెలంగాణ ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన కేటీఆర్‌పై కుట్రలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు కేసులతో వెనక్కితగ్గేది లేదని ఉండదని స్పష్టంచేశారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏసీబీ నోటీసులతో కట్టడి చేయలేరని కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ ఓ ప్రకటనలో తేల్చిచెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డికి పాలన చేతగాక అరాచకాలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.