MLA Madhavaram krishna rao | కేపీహెచ్‌బీ కాలనీ, మే 31: తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేలా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడం బాధాకరమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. పదేళ్ల పాలనలో అవినీతికి తావు లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత కేసిఆర్‌దేనన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా కేసిఆర్‌కు నోటీసులు జారీ చేసిందని, ఈ కేసు నుంచి కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటికి వస్తారన్నారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీలలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. ఎవరెన్ని లీకులు ఇచ్చినా బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉందని, ప్రజల పక్షాన పోరాడుతుందని తెలిపారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, కేటీఆర్‌లపై అడ్డగోలుగా మాట్లాడడం సరికాదని, పార్టీ పైన దుష్ప్రచారాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల బడే బాయ్ చోటే బాయ్‌లను ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రశ్నిస్తామని అన్నారు. తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
Fake Seeds | నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు : తొగుట సీఐ లతీఫ్
Ramayampet | లారీ – బైక్ ఢీ.. ఒకరికి తీవ్రగాయాలు
రామాయంపేటలో పాఠ్య పుస్తకాలు సిద్దం.. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే అందజేత