Ramayampet | రామాయంపేట, మే 31 : లారీ, బైక్ ఢీకొని ఒకరికి తీవ్రగాయాలైన ఘటన రామాయంపేట మండలం తొనిగండ్ల అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. మండలంలోని కాట్రియాలకు చెందిన తిరుమల రాజిరెడ్డి తన స్వగ్రామానికి రాత్రి రామాయంపేట నుండి బయలు దేరాడు. మార్గమద్యంలోని ముందు వెళ్తున్న లారీని గమనించక వెనుక నుండి లారీకి బైక్ను డీకొట్టాడు. ఈ ప్రమాదంలో రాజిరెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్సులో హుటాహుటిన రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు.