రామాయంపేట, మే 31 : రామాయంపేట మండలానికి సంబంధించిన పాఠ్యప్తుకాలను విద్యార్థులకు త్వరలోనే అందించనున్నట్లు మండల విద్యాధికారి అయిత శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. రామాయంపేట మండలంలోని 1 నుండి 10 తరగతుల వరకు 30 వేల పాఠ్య పుస్తకాలు అవసరం ఉంటాయని ప్రస్తుతం 21 వేల పాఠ్యపుస్తకాలు రావడం జరిగిందన్నారు. వచ్చిన వాటిని కూడా జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు త్వరలోనే పంపిణీ చేస్తామన్నారు. ప్రభత్వం బడిబాట సందర్భంగా నూతనంగా మరికొంత మంది విద్యార్థులు అడ్మిషన్లు జరుగుతున్నాయని అన్నారు. ప్రస్తుతం అన్ని సబెక్టులకు సంబంధించిన పుస్తకాలు రావడం జరిగిందన్నారు. మిగితా పుస్తకాలు కూడా త్వరలోనే రావడం జరుగుతుందన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు పుస్తకాలను అందజేయడం జరుతుందన్నారు. ఈ సమావేశంలో ఆర్పీలు సంతోష్, శంకర్, రాజు ఉన్నారు.