MLA Marri Rajasekhar Reddy | మల్కాజిగిరి, ఏప్రిల్ 3: ప్రభుత్వం అర్హులైన అందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఇవాళ వెంకటాపురం డివిజన్ ఇందిరానగర్‌లోని రేషన్ షాపులో తెల్ల రేషన్ కార్డు దారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సన్న బియ్యం పథకాన్ని కార్పొరేటర్లు సబితాకిషోర్, శాంతి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కుటుంబంలోని ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యాన్ని అందజేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పటికీ రేషన్ కార్డులు మంజూరు చేయలేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దరఖాస్తు చేసుకున్న వారందరికీ రేషన్ కార్డులు అందజేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా కిషోర్, అంజయ్య, విజయ్ శేఖర్ సంపత్, సయ్యద్ మోసిన్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
Pooja Hegde | శ్రీకాళహస్తీ రాహుకేతు పూజలో పాల్గొన్న పూజా హెగ్డే
A Raja: బొట్టు పెట్టుకోవద్దు.. కంకణం కట్టుకోవద్దు.. డీఎంకే నేత ఏ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు