CITU | ఉప్పల్, జూలై 5 : దేశవ్యాప్తంగా జూలై 9న నిర్వహించే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. నాచారంలోని పారిశ్రామికవాడలో నాచారం ఇండస్ట్రియల్ ఎంప్లాయిస్ యూనియన్, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శనివారం సదస్సు నిర్వహించారు. ఈ సమావేశం సీఐటీయూ ప్రధాన కార్యదర్శి గణేష్ అధ్యక్షతన చేపట్టారు.
కార్మిక హక్కుల కోసం చేపడుతున్న సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టడానికి కార్మికులు ముందుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రమ, శంకర్రావు, మారయ్య, చంద్రశేఖర్, దస్తగిరి, మల్లారెడ్డి, రమేష్, సూర్యం, ప్రవీణ, మధు, సత్యనారాయణ, శ్రీనివాసులు, శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతులకు తప్పని తిప్పలు.. మళ్లీ యూరియా కోసం కష్టాలు
RTC Special Bus | అరుణాచల గిరి ప్రదక్షిణకు దిల్సుఖ్నగర్ నుంచి ప్రత్యేక బస్సులు
Leopard | వడ్డేపల్లిలో చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు