CITU | చర్లపల్లి, జూలై 2 : కార్మిక వ్యతిరేక విధానాలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతూ కార్మికులను మోసం చేస్తుందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. చర్లపల్లి పారిశ్రామికవాడలోని సురానా చౌరస్తా వద్ద ఇండస్ట్రీయల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక, కార్యదర్శులు సత్యనారాయణ, శ్రీనివాసులు, ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ఆయన హజరైయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులకు సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమవుతున్నారని, ముఖ్యంగా మహిళలకు రాత్రి సమయంలో డ్యూటీలు వేయిస్తున్నారన్నారు. జూన్ తొమ్మిదవ తేదీన నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులతోపాటు అన్ని వర్గాలవారు పాల్గొనాలని ఆయన కోరారు.
జిల్లా సీఐటీయూ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కార్మికులకు ఉద్యోగ భద్రతను కల్పించేందుకు కార్మిక సంఘాలు కృషి చేస్తున్నాయన్నారు. పారిశ్రామికవాడలలోని కార్మికులు విధిగా సమ్మెలో పాల్గొన్ని కార్మికుల హక్కులను కాపాడుకొవాలని ఆయన సూచించారు. అనంతరం యూనియన్ కార్యదర్శి శ్రీనివాసులు, సత్యనారాయణలు ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు ప్రవీణ్, ఐఎఫ్టీయూ నాయకుడు శ్రీనివాస్, ఎపిరాక్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి మణికంఠ, వివిధ యూనియన్ల నాయకులు బాల్‌రాజు, రవీందర్‌రెడ్డి, నర్సింహ్మ, పి శ్రీనివాస్, ఆర్ శ్రీనివాస్, సంతోష్, అదాం, నరసమ్మలతోపాటు వివిధ పరిశ్రమల కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
SIGACHI | మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం.. సిగాచీ పరిశ్రమ ప్రకటన
Phoenix Movie | ఈ సినిమాకు ముందు 120 కిలోలున్నా : విజయ్ సేతుపతి కుమారుడు సూర్య