Vijay Sethupathy son Suriya | తమిళ నటుడు విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఫీనిక్స్’. ఈ సినిమాకు ఫైట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహిస్తున్నాడు. అనల్ అరసుకు కూడా దర్శకుడిగా ఇదే తొలి చిత్రం. ఇంతకుముందు అతడు జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, బ్రూస్ లీ, జై లవకుశ, షారుఖ్ ఖాన్ జవాన్ వంటి చిత్రాలకు ఫైట్ మాస్టర్ గా వ్యవహరించారు. ఈ చిత్రం జూలై 04న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యాక్షన్, స్పోర్ట్స్, డ్రామాగా రాబోతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో ఒకేసారి విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గోన్న సూర్య.. తన ఫిట్‌నెస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు ఈ సినిమా చేయకముందు 120 కిలోలున్నట్లు తెలిపాడు.
‘ఫీనిక్స్’ సినిమా మొదలుకాకముందు నా బరువు దాదాపు 120 కిలోలు ఉండేది. ఈ బరువును తగ్గించుకోవడానికి నాకు ఒకటిన్నర సంవత్సరం పట్టింది. బరువు తగ్గే క్రమంలోనే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) నేర్చుకున్నానని, ఇదే సినిమాకు ప్రధానాంశం అని సూర్య తెలిపాడు.