SIGACHI | మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం.. సిగాచీ పరిశ్రమ ప్రకటన
SIGACHI | పాశమైలారం ప్రమాద ఘటనపై సిగాచీ పరిశ్రమ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ప్రమాదంపై స్టాక్ మార్కెట్లకు కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ లేఖ రాశారు.
SIGACHI | హైదరాబాద్ : పాశమైలారం ప్రమాద ఘటనపై సిగాచీ పరిశ్రమ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ప్రమాదంపై స్టాక్ మార్కెట్లకు కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ లేఖ రాశారు. ఈ ప్రమాదంలో 40 మంది మరణించినట్లు లేఖలో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇస్తామని స్పష్టం చేశారు. ప్రమాదంలో 33 మంది గాయపడ్డారని పేర్కొంది. గాయపడిన వారికి పూర్తి వైద్యసాయం అందిస్తామని తెలిపింది. గాయపడిన కార్మికులను అన్ని విధాలుగా అండగా ఉంటాం. కార్మికులకు అన్ని రకాల బీమా క్లెయిమ్‌లు చెల్లిస్తాం. క్షతగాత్రుల వైద్య ఖర్చులు భరిస్తాం.. వారి కుటుంబ పోషణ చూస్తామని సిగాచీ పరిశ్రమ తరపున కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ ప్రకటించారు. ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని తెలిపారు. ప్రభుత్వ విచారణ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. పరిశ్రమలో మూడు నెలల పాటు(90 రోజులు) కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు వివనేక్ కుమార్ ప్రకటించారు.

Sigachi
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్లంబర్ విమానాన్ని దించగలడా?
కశ్మీర్ బస్సులపై రెండ్రోజుల్లో రెండు దాడులు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

