Seasonal Deseases | రాయపోల్, జూలై 01 : వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రజలని చుట్టుముడుతుంటాయి నీటి కాలుష్యంతో జలుబు, దగ్గు, తుమ్ములు వాంతులు, నీళ్ల విరోచనాలు వంటి రోగాలు అతులాకుతులం చేస్తాయి. దోమకాటుతో టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, మెదడు వాపు, చికెన్ గున్యా లాంటి విష జ్వరాలతోపాటు ఫైలేరియా వ్యాధులు వస్తాయి. వీటి బారిన పడి చిన్నారులు , వృద్ధులు, గర్భిణీలు అనేక ఇబ్బందులకు గురవుతారు.
ఇప్పటికే ఆయా వ్యాధుల బారిన పడిన వారు ప్రభుత్వ ప్రైవేటు, ఆసుపత్రిలో చూపెట్టుకుంటున్నారు. జ్వరం, గొంతు నొప్పి, వాంతులతో ఆసుపత్రుల మెట్లు ఎక్కుతున్నారు. వాతావరణంలో జరిగిన మార్పులతోనే అధిక శాతం సీజనల్ రోగాల బారిన పడుతున్నారని వైద్యులు చెపుతున్నారు. జ్వరం ఇతర లక్షణాలు ఎక్కువగా ఉంటే వెంటనే ఆసుపత్రులకు వెళ్లాలని లేకపోతే ప్రాణానికి ముప్పు తప్పదని చెప్తున్నారు.
టైఫాయిడ్ లక్షణాలు..
ఎక్కువ రోజులపాటు జ్వరం తీవ్రత, నీళ్లు, చీము బంక విరోచనాలు శరీరంలో ఉండే నీటి శాతం తగ్గినట్లు ఏర్పడుతుంది. దీనిని టైఫాయిడ్ లక్షణాలుగా గుర్తించాలి. టైఫాయిడ్ జ్వరం వచ్చిన వెంటనే వైద్యులను కలిసి చికిత్స చేయించుకోవాలి. లేకపోతే ప్రాణాలకు ప్రమాదం ఉండే అవకాశం ఉన్నది
కలరా లక్షణాలు..
నీళ్ల విరోచనాలు, వాంతులు కావడం ద్వారా శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ అవుతుంది.
పచ్చ కామెర్ల లక్షణాలు..
కాలేయానికి వాపురావడం, కళ్ళు పసుపు పచ్చగా మారడం, ఆకలి లేకపోవడం, నీరసంగా ఉండడం పచ్చకామెర్ల వ్యాధిగా గుర్తించాలి
దోమకాటుతో విష జ్వరాలు :
వర్షాకాలంలో దోమల బెడద తీవ్రమవుతుంది. వానల కారణంగా పరిసరాలు అపరిశుభ్రంగా మారతాయి. ఖాళీ ప్రదేశాలు మురికి గుంతలు డ్రైనేజీలలో నీటి నిలువలు పేరుకపోయి దోమల ఉత్పత్తి పెరుగుతుంది. దోమకాటు వల్ల డెంగీ, మలేరియా, చికెన్ గున్యా వంటి విష జ్వరాలతో పాటు ఫైలేరియా వంటి రోగాలు వస్తాయి.
ఈగలతో ముప్పు..
వర్షాకాలంలో దోమల కంటే ఈగల కారణంగానే అనేకమంది ఆసుపత్రిలో చేరుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఈగలను చంపే మందు ప్రత్యేకంగా లేదు. ఈగకు కుట్టే గుణం లేకుండా మెడికల్ ట్రాన్స్ఫర్ విధానం వల్ల రోగాలను తెచ్చిపెడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కడ ఉమ్మేసే గుణం ఉండడంతో ప్రజల వద్దకు ప్రాణాంతక వ్యాధులను ఈ రకంగా మోసుకెళ్తుంది. వీటితో కలరా కామెర్లు, టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన పడతారు.
దోమకాటుకు గురైన రోగులకు చికిత్స ద్వారా నయం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఈగల ద్వారా వచ్చిన వ్యాధులను నివారించడానికి తలకు మించిన భారంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. వర్షాకాలంలో ఈగలు వాలకుండా ఆహార పదార్థాలపై నిత్యం మూతలు పెట్టి ఉంచాలి. చల్లని పదార్థాల కంటే వేడి పదార్థాలను ఎక్కువ తీసుకోవడం మంచిది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
కాచి చల్లార్చి వడపోసిన నీటిని మాత్రమే తాగాలి. వాంతులు విరోచనాలు కలరాతో బాధపడుతున్న వ్యక్తికి గ్లాసు నీటిలో ఒక స్పూన్ చక్కెర చిటికెడు ఉప్పు కలిపిన ద్రావణాన్ని లేదా ఓఆర్ఎస్ ద్రావణాన్ని తరచూ తాగించాలి. వైద్యుడి వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించాలి. కలరా టైఫాయిడ్ పచ్చకామెర్ల వ్యాధులతో బాధపడే రోగులను విడివిడిగా ఉంచాలి. రోగులకు సంబంధించిన గ్లాసులు ప్లేట్లు కూడా విడిగా ఉండేలా చూసుకోవాలి. చిన్న పిల్లలకు మలం కడిగిన తల్లులు తమ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ఇంటి పరిసరాలతో పాటు ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. నివాసాల సమీపంలోని మురుగు గుంతలను పూడ్చాలి. ఇంటిలో ఫినాయిల్‌తో ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. వర్షాకాలంలో బయట ఆహార పదార్థాలను తీసుకోకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఆహార పదార్థాలపై ఈగలు క్రీములు వాలకుండా ఎప్పుడూ మూతలు పెట్టి ఉంచుకోవాలి.
గ్రామాలలో పరిశుభ్రతతో వ్యాధులు దూరం..
వర్షాకాలంలో పరిశుభ్రత తోనే సీజనల్ వ్యాధులు దూరం చేసుకోవచ్చు. నివాసాలు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ఆహార పదార్థాలపై ఈగలు వాడకుండా చూసుకోవడంతో పాటు వేడి పదార్థాలు మాత్రమే తినాలి. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నీటినినిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలి. అస్వస్థతకు గురైన వెంటనే సమీప వైద్యులను సంప్రదించాలి.
Couple died | రెండు నెలల క్రితం ప్రేమ వివాహం.. సిగాచీ ఫార్మా ప్రమాదంలో దంపతులు దుర్మరణం
Chahat Bachpai | డ్రైనేజీని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ చాహత్ బాచ్‌పాయ్
NTR Vs Hrithik Roshan | వార్ 2 సెట్స్‌లో డ్యాన్స్‌తో దుమ్ము లేపబోతున్న స్టార్ హీరోలు!