ఐనవోలు, మార్చి 15 : హనుమకొండ జిల్లా ఐనవోలులో బలిజె మేడలమ్మ, గొల్ల కేతమ్మ సమేత మల్లికార్జునస్వామి కల్యాణం కనుల పం డువగా జరిగింది. ఫాల్గుణ మాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకొని ఈ క్రతువు నిర్వహించగా భక్తులు భారీగా తరలివచ్చారు. కల్యా ణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఒగ్గు పూజారులు స్వామి మేలుకొలుపు అనంతరం ఆలయ ఆవరణలో పెద్ద పట్నం వేశారు. తెల్లపిం డి, పసుపు, పచ్చ, కుంకుమ తదితర రంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన పెద్ద పట్నం భక్తులను ఆకట్టుకుంది.
ఆ పిదప నిర్వహించిన కల్యాణం అనంతరం పెద్ద పట్నాన్ని తొక్కే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల య ఆవరణంతా మల్లన్న నామస్మరణతో మా ర్మోగింది. ఆయా కార్యక్రమాల్లో ఈవో కందుల సుధాకర్, ఆలయ కమిటీ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్‌గౌడ్, ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు ఐనవోలు మధుకర్‌శర్మ, పాతర్లపాటి శ్రీనివాస్, వేదపండితుడు గట్టు పురోషోత్తమ శర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, అర్చకులు నందనం భానుశర్మ, నందనం మధుశర్మ, ఉప్పుల శ్రీనివాస్, పాతర్లపాటి నరేశ్‌శర్మ, మడికొండ దేవేందర్, ఆలయ అధికారులు కిరణ్‌కుమార్, శ్రీకాంత్, రాజు, ఒగ్గు పూజారులు పాల్గొన్నారు. పర్వతగిరి సీఐ రాజగోపాల్, ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

