సారంగాపూర్, ఆగస్టు 3 : జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్ర శివారులోని రోళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణం దాదాపు 90 శాతం పూర్తయింది. అటవీశాఖ అనుమతులు ఆలస్యం కావడంతో షటర్ల బిగింపు ఆగిపోయింది. పాత అనుమతుల ప్రకారం 0.25టీఎంసీల నీటి నిల్వ కోసం గేట్లు అమర్చుతామని గతేడాది నుంచి అధికారులు చెబుతన్నప్పటికీ.. ఇప్పటి వరకు బిగించలేదు. ఈ క్రమంలో ఇటీవల పడిన భారీ వర్షాలతో రోళ్లవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుకున్నది. అయితే ప్రాజెక్ట్‌కు షటర్లు బించకపోవడంతో వచ్చిన నీరు వచ్చినట్టే బయటకు వెళ్లి పోతున్నది. ప్రాజెక్టులో నీరు తగ్గిపోవడంతో ఆయకట్టు రైతాంగం ఆందోళన చెందుతున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి త్వరగా షటర్లు బిగించి సాగునీటిని అందించి తమను ఆదుకోవాలని కోరుతున్నది.