బాలీవుడ్ నటి తాప్సీ పన్ను సంతోషంలో మునిగి తేలుతున్నది. ఆమె నటించిన తాజా సినిమా ‘గాంధారి’ ఇటీవలే ఓటీటీలో విడుదలై విశేష స్పందన చూరగొనడమేకాక, కథానాయిక తాప్సీకి ‘ఉమెన్ ఆఫ్ ది ఇయర్ – 2026’ అవార్డుని కూడా కట్టబెట్టింది. ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ ‘ఎలాంటి ప్లానింగ్ లేకుండానే నా సినీప్రయాణం మొదలైంది.
ప్రతి ఏడాదీ నేను ఏదో ఒక అవార్డు గెలుచుకుంటున్నానంటే కారణం, నా తోటి నటీమణులే. వాళ్లు తమ అభినయంతో ప్రమాణాలకు పెంచకపోతే.. వాటిని అందుకునేందుకు నేను శ్రమించేదాన్ని కాదేమో. ఇండస్ట్రీలో మంచి పాత్రల కోసం తపించే ప్రతి మహిళకూ ఈ అవార్డు అంకితం. నా చుట్టూ ఉన్న సాధారణ మహిళల జీవితాలే నా పాత్రలకు ప్రేరణ. ఆ జీవితాలను తెరపై ప్రతిబింబించడమే నాలక్ష్యం’ అంటూ చెప్పుకొచ్చింది తాప్సీ పన్ను.