తునికాకు బ్యాగులు మాయం!
తునికాకు బస్తాలు పెద్ద మొత్తంలో మాయమయ్యాయి. కాంట్రాక్టర్ నిబంధనలకు విరుద్ధంగా బయటి మార్కెట్లో విక్రయించి రూ.లక్షల సొమ్ము కాజేసిన తీరు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అటవీశాఖ అధికారులు ఈ అక్రమ దందాను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదు చేశారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం..
- గోల్మాల్ చేసిన కాంట్రాక్టర్
- బయటి మార్కెట్లో విక్రయం
- విలువ రూ. 50 లక్షలకు పైమాటే..
- ఆడిట్ రిపోర్ట్‌తో వెలుగులోకి..
- అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు
- సెటిల్మెంట్ కోసం రంగంలోకి మంత్రి అనుచరుడు
సుబేదారి, మార్చి15: తునికాకు బస్తాలు పెద్ద మొత్తంలో మాయమయ్యాయి. కాంట్రాక్టర్ నిబంధనలకు విరుద్ధంగా బయటి మార్కెట్లో విక్రయించి రూ.లక్షల సొమ్ము కాజేసిన తీరు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అటవీశాఖ అధికారులు ఈ అక్రమ దందాను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదు చేశారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 2022 సంవత్సరంలో మంగపేటలో తునికాకు టెండర్ దక్కించుకున్న అబ్దుల్ రహమాన్ అక్కడి అటవీ ప్రాంతం నుంచి సేకరించిన తునికాకు బస్తాలను వరంగల్‌లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సమీప గోదాములో నిల్వ చేయగా, అందులో రూ. 50లక్షలకు పైగా విలువ చేసే 671 బ్యాగులు మాయమయ్యాయి. వాటిని కాంట్రాక్టర్, అతడి దగ్గరి బంధువైన గుమస్తా కలిసి పశ్చిమ బెంగాల్‌లోని పొగాకు కంపెనీలకు విక్రయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ విషయాన్ని ఆ సమయంలో హనుమకొండ జిల్లా అటవీశాఖ అధికారిగా పనిచేసిన, ఇప్పుడు పై స్థాయిలో ఉన్న ఓ అధికారి కప్పిపుచ్చి, కాంట్రాక్టర్ వద్ద డబ్బులు తీసుకున్నట్లు ఇటీవల ఆడిట్ రిపోర్ట్‌లో గుర్తించారు. అయితే కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకున్న ఉన్నతాధికారి అతడిని కాపాడేందుకు ఆ సమయంలో తునికాకు గోదాము పర్యవేక్షణలో ఉన్న ఓ అధికారిని బాధ్యుడిగా చేసేందుకు ముమ్మరంగా యత్నించినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న గోదాము పర్యవేక్షణ అధికారి ప్రస్తుతం వరంగల్ జిల్లా అటవీశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లడంతో సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని వరంగల్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సాంబు గత నెల 23న ఎనుమాముల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, అతడిపై కేసు నమోదైంది.
రంగంలోకి మంత్రి అనుచురుడు..
తునికాకు కాంట్రాక్టర్ 671 బస్తాలను గోదాము నుంచి మాయం చేసి, బయటి మార్కెట్లో విక్రయించడం, అతడిపై కేసు నమోదు అయిన విషయం తెలుసుకున్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ మంత్రి ప్రధాన అనుచరుడు సెటిల్మెంట్ చేయడానికి రంగంలోకి దిగాడు. అతడి డైరెక్షన్లో మా యం చేసిన బస్తాల్లో కొన్ని బ్యాగుల్లో పాడైన తునికాకు ఉన్నట్లు లెక్కల్లో చూపినట్లు తెలిసింది. అవి కూడా 2022లో గోదాములో నిల్వ చేసిన తునికాకు బస్తాలతో ట్యాలీ కాలేదు. ఈ విషయాన్ని ఇటీవల అటవీశాఖ అధికారుల విచారణలో గుర్తించారు. అయితే అసలు కాంట్రాక్టర్‌ను వదిలి, మంత్రి ప్రధా న అనుచరుడి ఒత్తిడితో 2022లో అప్పటి గోదాము పర్యవేక్షణ అధికారిని బాధ్యుడిగా చేయడానికి వరంగల్ జిల్లా అటవీశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. ఈ విషయంలో సెటిల్మెంట్ చేయడానికి మంత్రి అనుచరుడు పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

