Breast cancer | మల్కాజిగిరి, జూన్ 3 : మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోఇండియన్ ఆయిల్ సంస్థ (సీఆర్ఎస్) కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ సర్వీసెస్ నిధులు ద్వారా మహిత స్వచ్ఛంద సంస్థ సహకారంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా రేడియేషన్ లేకుండా రొమ్ము క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్‌ను గుర్తించే అత్యాధునిక స్క్రీనింగ్ ఇనిషియేటివ్ మిషన్, తెలంగాణ డయాగ్నస్టిక్స్ మినీ హబ్‌ను ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. మహిళల్లో తరచూ వచ్చే రొమ్ము క్యాన్సర్‌తోపాటు సర్వైకల్ క్యాన్సర్‌ను ప్రాథమిక దశలో పరీక్షలు నిర్వహించి గుర్తించవచ్చని అన్నారు. అల్వాల్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించే అత్యాధునిక మిషన్లు అందుబాటులో ఉన్నాయని, మహిళలు స్వచ్ఛందంగా వచ్చి ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ ఉమ గౌరీ, డాక్టర్ శోభ , ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సీజీఎం బద్రీనాథ్, కైలాష్, కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, మహిత డైరెక్టర్ రమేష్ శేఖర్ రెడ్డి, మంకెన శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Crocodile | గద్వాలలో అర్ధరాత్రి కలకలం.. ఇండ్ల మధ్యకు వచ్చిన మొసలి
Electric Vehicles | రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు.. రెండు లక్షలు దాటిన ఈవీలు
Mongolia | విశ్వాసం కోల్పోయి.. మంగోలియా ప్రధాని రాజీనామా