MLA Marri Rajasekhar Reddy | మల్కాజిగిరి ఏప్రిల్ 3: పేదలకు వైద్య ఆరోగ్య సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఇవాళ బోయిన్ పల్లిలోని క్యాంపు కార్యాలయంలో అల్వాల్, వెంకటాపురం, మల్కాజిగిరి డివిజన్లకు చెందిన 14 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే రూ.7.44 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యం కోసం బస్తీలలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామన్నారు. మల్కాజిగిరిలోని దవాఖాన, మల్కాజిగిరి అల్వాల్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ప్రైవేట్ దవాఖానాలకు ధీటుగా ప్రభుత్వ దవాఖానాలో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా కిషోర్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, జేఏసీ అధ్యక్షుడు వెంకన్న, రావుల అంజయ్య, అనిల్ కిషోర్, అమీనుద్దిన్, రాము యాదవ్, జనార్ధన్, శ్రీనివాస్ గౌడ్, యాదగిరి గౌడ్, ఉష శ్రీ, విజయ్, శేఖర్, సంతోష్ నాయుడు, వంశీ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.
Pooja Hegde | శ్రీకాళహస్తీ రాహుకేతు పూజలో పాల్గొన్న పూజా హెగ్డే
A Raja: బొట్టు పెట్టుకోవద్దు.. కంకణం కట్టుకోవద్దు.. డీఎంకే నేత ఏ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు