Auto Driver | శివ్వంపేట, మే 3 : అప్పులు పెరిగి మనోవేదనకు గురై ఆటో డ్రైవర్ సెల్ఫీ తీసుకుంటూ పురుగుల మందు తాగిన ఘటన శివ్వంపేట మండలం కొత్తపేట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే కొత్తపేట గ్రామానికి చెందిన కంచాన్పల్లి శేఖర్‌కు కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు దాదాపు రూ.20 లక్షల వరకు ఉన్నాయి. దీంతో అప్పులు ఎక్కువయ్యాయని హైదరాబాద్‌కు గత మూడు సంవత్సరాల కిందట వలస వెళ్లి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
కొత్తపేట గ్రామం మీదుగా త్రిబుల్ ఆర్ రోడ్డు పోతుండటంతో ఆ రోడ్డులో 25గుంటల వరకు శేఖర్‌కు చెందిన భూమి పోతుంది. నష్టపరిహారం ఇస్తే తన అప్పులు తీర్చుకుందామనుకున్న శేఖర్ నష్టపరిహారం రాకపోవడంతో అప్పుల బాధ ఎక్కువైంది. తనకున్న మూడెకరాల సీలింగ్ భూమిని ఇతరులు కబ్జా చేశారు. మరోవైపు ఫ్రీ బస్సు వచ్చినప్పటి నుంచి ఆటోకిరాయిలు లేక కుటుంబాన్ని సైతం పోషించలేని పరిస్థితి దాపురించిందని తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. కొత్తపేటకు వచ్చిన శేఖర్ సెల్ఫీ వీడియో తీసి తన బాధలు వెల్లగక్కాడు.
కేసీఆర్ సార్ ఉన్నప్పుడే చాలా బాగుండే… రేవంత్‌రెడ్డి సార్ మంచిగ జేయట్లేదు., రేవంత్‌రెడ్డి ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఉన్న ఉపాధి కోల్పోయిన. నాలాంటి ఆటో డ్రైవర్లు ఎంతో మంది ఉపాదికోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. కేసీఆర్ సార్ మంచిగ చేసిండు. రేవంత్‌రెడ్డి బతికేటోడిని బతకనిస్తలే అని ఆవేదన చెందాడు. మాలాంటోళ్లను ఆదుకోవడం కేసీఆర్ సార్‌తోనే ఐతది. రేవంత్‌రెడ్డి సార్‌తో కాదు అని పురుగుల మందు తాగి కుటుంబీకులకు వీడియో పంపాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబీకులు వెంటనే నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి..
ఉపాదికోల్పోయి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన శేఖర్‌ను మంగళవారం ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి చేరుకొని పరామర్శించారు. మంచి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి డాక్టర్లకు సూచించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అదేవిధంగా శేఖర్‌కు సంబంధించిన భూ సమస్యను పరిష్కరించాలని ఆర్డీఓ, తహశీల్దార్లను ఆదేశించారు. ట్రిపుల్ఆర్ నష్టపరిహారం త్వరగా అందించాలని అధికారులతో మాట్లాడారు.
Crocodile | గద్వాలలో అర్ధరాత్రి కలకలం.. ఇండ్ల మధ్యకు వచ్చిన మొసలి
Electric Vehicles | రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు.. రెండు లక్షలు దాటిన ఈవీలు
Mongolia | విశ్వాసం కోల్పోయి.. మంగోలియా ప్రధాని రాజీనామా