షాద్ నగర్ టౌన్,ఫిబ్రవరి 14 : ఆర్టీసీ బస్సు(RTC bus) లారీని ఢీ కొట్టిన ఘటనలో పలువురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. షాద్ నగర్ పట్టణంలోని పరిగి రోడ్డులో గల పోచమ్మ దేవాలయం వద్ద గురువారం యూటర్న్ తీసుకుంటున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టడంతో నలుగురికి గాయాలు అయ్యాయి. మహబూబ్నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పరిగి రోడ్డులో యూటర్న్ తీసుకుంటుంది.
అదే సమయంలో పరిగి రోడ్డు నుంచి షాద్ నగర్ కు వేగంగా వస్తున్న లారీ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఇదిలా ఉంటే లారీ అతివేగం తోనే ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Upasana | ఆంటీ ప్లీజ్ వెయిట్ చేయండి.. వాలంటైన్స్ డే సందర్భంగా ఆకట్టుకుంటున్న ఉపాసన పోస్ట్
Kothagudem | హమాలీ ఖాతాలో నగదు మాయం.. 70 వేలు కాజేసిన కేటుగాళ్లు