Upasana | నేడు ప్రేమికుల రోజు (Valentains Day). ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, సినీ తారలు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో మెగా కోడలు, టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన (Upasana) పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తోంది.
ప్రేమికుల రోజు అనేది 22 ఏళ్లు అంతకంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయిలకు సంబంధించినదని పేర్కొన్నారు. ‘వాలంటైన్స్ డే అనేది 22 ఏళ్లు అంతకంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయిలకు సంబంధించింది. మీరు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు అయితే.. ఆంటీ ప్లీజ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే (International Womens Day) కోసం వెయిట్ చేయండి’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో ఉపాసన రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు స్మైలీ ఎమెజీని జత చేశారు. ప్రస్తుతం ఉప్సీ పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
Also Read..
Kollagottanadhiro | వాలంటైన్స్ డే స్పెషల్.. ‘హరిహర వీరమల్లు’ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్
Ram Charan | కొత్త సినిమాకు రామ్‌చరణ్ గ్రీన్‌సిగ్నల్.. దర్శకుడు ఎవరంటే?