Prabhas | ఫౌజీలో అనుపమ్‌ఖేర్
Prabhas | 1940నాటి హిస్టారికల్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో ప్రభాస్ నటిస్తున్న పానిండియా యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.
Prabhas | 1940నాటి హిస్టారికల్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో ప్రభాస్ నటిస్తున్న పానిండియా యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. లార్జర్ దేన్ లైఫ్ ఎలిమెంట్స్‌తో కూడిన పాన్ ఇండియా సినిమాగా దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే.. ఈ చిత్రంలో బాలీవుడ్ లెజెండ్ అనుపమ్‌ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా షేర్ చేశారు.
పైగా తన పోస్ట్‌లో ‘ఈ స్క్రిప్ట్ అద్భుతం’ అని పేర్కొన్నారాయన. ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం పట్ల అనుపమ్ ఆనందం వ్యక్తం చేశారు. దర్శకుడు హను రాఘవపూడి ప్రతిభను కూడా ఆయన ప్రశంసించారు. ‘ఇండియన్ బాహుబలి ప్రభాస్‌తో నా 544వ చిత్రం ప్రకటిస్తున్నందుకు ఆనందంగా ఉంది.
ప్రతిభావంతుడైన దర్శకుడు హను రాఘవపూడి, రాజీ అనే పదానికి అర్థం తెలియని మైత్రీ మూవీమేకర్స్, మై డియర్ ఫ్రెండ్ సుదీప్ ఛటర్జీ.. ఈ కలయిక నిజంగా అద్భుతం..’ అని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇమాన్వి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

