IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 (IPL) 18వ ఎడిషన్ మార్చి 22న మొదలవనున్నది. ఈ సీజన్ తొలి మ్యాచ్ గతేడాది చాంపియన్స్‌గా నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనున్నది. తొలి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరుగుతుందని క్రిక్‌బజ్ నివేదిక పేర్కొంది. ఆర్సీబీ కొత్త సీజన్లో కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ నాయకత్వంలో బరిలోకి దిగుతుంది. అలాగే, గతేడాది రన్నరప్‌గా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) సైతం తన తొలి మ్యాచ్ హోంగ్రౌండ్ అయిన హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తుంది. ఫస్ట్ మ్యాచ్‌ను మార్చి 23న ఆదివారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ స్టేడియంలో రాజస్థాన్ (RR)తో తలపడనున్నది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం జరుగున్నట్లు నివేదిక పేర్కొంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు బీసీసీఐ అధికారికంగా షెడ్యూల్‌ను విడుదల చేయలేదు. బోర్డు కొన్ని కీలక మ్యాచుల తేదీలను ఫ్రాంచైజీలతో షేర్ చేసినట్లు సంబంధితన వర్గాలు తెలిపాయి. ఫైనల్ మ్యాచ్ ఆదివారం మే 25న కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరుగునున్నట్లు తెలుస్తున్నది. జనవరి 12న ముంబయిలో జరిగిన బీసీసీఐ ప్రత్యేక సర్వ సర్వసభ్య సమావేశంలో ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పాల్గొన్నారు. అనంతరం ఐపీఎల్ షెడ్యూల్‌పై కీలక ప్రకటన చేశారు. మార్చి 23 నుంచి ఐపీఎల్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. తాజాగా బోర్డు మార్చి 22 నుంచి ఐపీఎల్‌ను ప్రారంభించాలని నిర్ణయించినట్లు నివేదిక చెప్పింది. బ్రాడ్‌కాస్టర్స్ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఐపీఎల్-2025 సీజన్లో గతంలో మాదిరిగానే 10 వేదికల్లో మ్యాచులు జరుగుతాయి. అలాగే, ఈ సారి ఐపీఎల్ మ్యాచులకు ఈ సారి కొత్త వేదికల్లోనూ పలు మ్యాచులు నిర్వహించనున్నారు. ఈ సారి మ్యాచులు అహ్మదాబాద్, ముంబయి, చెన్నై, బెంగళూరు, లక్నో, ముల్లన్పూర్, ఢిల్లీ, జైపూర్, కోల్‌కతా, హైదరాబాద్, గువాహటి, ధర్మశాలలో జరుగుతాయి. రాజస్థాన్ రాయల్స్ గువాహటిని రెండో హోంగ్రౌండ్‌గా ఎంపిక చేసుకుంది. మార్చి 26, 30 తేదీల్లో ఇక్కడ రెండు మ్యాచులు జరుగనున్నాయి. రాజస్థాన్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచులు ఆడుతుంది. పంజాబ్ కింగ్స్ కొన్ని మ్యాచులు ధర్మశాలలోను జరుగుతుంది. ఈ సారి హిమాచల్‌ప్రదేశ్‌లోని మైదానం మూడు మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. క్వాలిఫైయర్-1 ఎలిమినేటర్ మ్యాచులు హైదరాబాద్‌లో జరుగుతాయి. అయితే, క్వాలిఫైయర్-2, ఫైనల్ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతాయి. ఐపీఎల్ 2025 పూర్తి షెడ్యూల్ రెండు మూడు రోజుల్లోనే బీసీసీఐ విడుదల చేయనున్నట్లు తెలుస్తున్నది. ఐపీఎల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరిలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనున్నది. ఐసీసీ ఈవెంట్‌కు పాకిస్థాన్, దుబాయిలో జరుగనున్నాయి. టీమిండియా మ్యాచులన్నీ దుబాయి వేదికగా ఆడుతుంది. ఫైనల్‌కు భారత్ చేరితే దుబాయిలోనే జరుగుతుంది. చాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న మొదలై.. మార్చి 9 వరకు కొనసాగనున్నది. ఆ తర్వాత ఐపీఎల్ సంగ్రామం మొదలుకానున్నది.