Govt Schools | షాబాద్, జూన్ 23: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని షాబాద్ మండల విద్యాశాఖ అధికారి లక్ష్మణ్ నాయక్ అన్నారు. సోమవారం షాబాద్ పరిధిలోని వెంకమ్మగూడ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపించాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్ బుక్స్ అందించడం జరుగుతుందని, దీని ద్వారా విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు ఎంతో మెరుగుపడుతున్నాయని చెప్పారు.
వెంకమ్మగూడ గ్రామంలోని విద్యార్థులు అందరూ ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవ్వడం ఎంతో శుభ పరిణామం అన్నారు. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల్ని జాయిన్ చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సింహాద్రి నాయుడు, పిఆర్టియు మండల ప్రధాన కార్యదర్శి క్రిష్ణ, అంజయ్య, అంగన్వాడి టీచర్ వినోద, గ్రామస్తులు నర్సింహులు, బుచ్చయ్య, కుమార్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
Alumni | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. పాతికేళ్ల తర్వాత పూర్వ విద్యార్థులంతా కలిశారు
Rayaparthi | వ్యవసాయ భూములకు వెళ్లే బాట కబ్జా.. కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన
Suryapet | కేసుల పరిష్కారంలో న్యాయవాదుల సహకారం అవసరం : జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన