Alumni | చేర్యాల, జూన్ 22 : వారంతా కలిసి చదువుకున్నారు. వారంతా ఇప్పుడు ఒక్కొక్కరు తమతమ ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర పనుల్లో కొనసాగుతున్నారు. ఇప్పుడంతా పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో ఒక్కచోట చేరి సందడి చేశారు.
చేర్యాల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 1998-99 బ్యాచ్‌కు చెందిన 10వ తరగతి విద్యార్ధులు పాఠశాలలో ఆదివారం పూర్వపు విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. 25 వసంతాల అనంతరం నిర్వహించుకున్న సమ్మేళనంలో పూర్వవిద్యార్థులంతా కలిసి నాడు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులకు శాలువాలు కప్పి మెమోంటోలు అందించి ఘనంగా సన్మానించారు.
నాడు చదువుకున్న పాఠశాలలో ఒక్క రోజు సంతోషంగా గడపడంతోపాటు నాటి మధుర క్షణాలను, సరదా విషయాలను నెమరేసుకున్నారు. 25 సంవత్సరాల అనంతరం కలుసుకున్న పూర్వపు విద్యార్ధులు నేడు వారు చేస్తున్న ఉద్యోగాలు, వారి కుటుంబ స్ధితిగతులు, సుఖసంతోషాలను పాలుపంచుకున్నారు.
Peddagattu | జీఓ ఇచ్చారు.. నిధులు మరిచారు.. కాంగ్రెస్ హయాంలో లింగమంతుల స్వామికి శఠగోపమేనా?
Bigg Boss 9 | బిగ్ బాస్ సందడికి టైం ఫిక్స్ అయినట్టేనా.. కంటెస్టెంట్స్ ఎవరెవరంటే..!
Road Accident | వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి