Bigg Boss 9 | గత కొన్ని సీజన్లుగా తెలుగు ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో సక్సెస్ ఫుల్ గా ఎనిమిది సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు సీజన్ 9 కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సారి హౌజ్‌లోకి వెళ్లబోయే కంటెస్టెంట్స్ ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తుంది. గత సీజన్ల మాదిరిగానే బుల్లితెర సెలబ్రిటీలు, పాపులర్ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక మొదలైందని, పలువురిని ఫైనల్ చేసినట్టు కూడా ప్రచారం జరుగుతుంది.
తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం సీరియల్ నటి తేజస్విని, ఇటీవల పబ్‌లో వివాదంతో పాపులర్ అయిన కల్పికా గణేష్, అలాగే బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ విన్నర్ నిఖిల్ లవర్ అయిన సీరియల్ నటి కావ్య, అలాగే, మరో క్రేజీ ఆర్టిస్ట్ నవ్యసామి , `ఛత్రపతి` శేఖర్, బుల్లితెర నటుడు ముఖేష్ గౌడ, జ్యోతిరాయ్, సీనియర్ నటుడు సాయికిరణ్, యూట్యూబర్ శ్రావణి వర్మ, ఆర్జే రాజ్ ల పేర్లు తెరపైకి వచ్చాయి. సోషల్ మీడియాలో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పాపులర్ అయిన బమ్ చిక్ బబ్లూను కూడా బిగ్ బాస్ మేకర్స్ సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక వీరితో పాటు జబర్థస్త్ కామెడియన్ ఇమ్మాన్యుయేల్, సీరియల్ నటి డెబ్జానీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. స్టార్ మాలో ప్రసారమవుతున్న కిర్రాక్ బాయ్స్, ఖిలాడీ గర్ల్స్ షోలో పాల్గొంటున్న కొందరు ఆర్టిస్టులు కూడా షోలో పాల్గొని సందడి చేయనున్నారనే టాక్ వినిపిస్తుంది.ఇక ఈ షో సెప్టెంబర్ 7 నుండి మొదలు కానుందని, హోస్ట్‌గా నాగార్జుననే ఉంటారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న పేర్లని బట్టి చూస్తుంటే ఈ సారి షో మరింత రక్తికట్టించేలా ఉండబోతుందని, కాంట్రవర్సీ, ఎంటర్టైన్మెంట్, వార్ గట్టిగానే ఉండనుందని అర్థమవుతుంది.