Suryapet | కేసుల పరిష్కారంలో న్యాయవాదుల సహకారం అవసరం : జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన
Suryapet | పెండింగ్ కేసుల పరిష్కారంలో న్యాయవాదుల సహకరించాలని మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తి ఆయేషా సరీన అన్నారు.
హుజూర్ నగర్, జూన్ 23 : పెండింగ్ కేసుల పరిష్కారంలో న్యాయవాదుల సహకరించాలని మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తి ఆయేషా సరీన అన్నారు. సోమవారం స్థానిక న్యాయస్థానాల ప్రాంగణంలో బార్ అసోసియేషన్ అధికార ప్రతినిధి కాల్వ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన స్వాగత సమావేశంలో ఆమె మాట్లాడారు. తనకు న్యాయమూర్తిగా హుజూర్ నగర్ రెండవ స్థానమన్నారు. తన పూర్వ న్యాయమూర్తులకు ఇచ్చిన సహకారాన్ని తనకు అందిస్తారనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. తన నుంచి గాని తన సిబ్బంది నుంచి గాని ఏదైనా ఇబ్బంది కలిగితే తన దృష్టికి తీసుకురావాలన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో తన వంతు ప్రయత్నం చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.
ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మారుతి ప్రసాద్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా తనకు పూర్తిగా సహకరిస్తున్నందుకు న్యాయవాదులకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే సహకారాన్ని తన తోటి న్యాయమూర్తికి కూడా అందించాలని కోరారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు సామల రామిరెడ్డి మాట్లాడుతూ పెండింగ్ కేసుల పరిష్కారంలో విధుల నిర్వహణలో న్యాయమూర్తులకు తమ న్యాయవాదులు పూర్తిగా సహకరిస్తారని న్యాయమూర్తులకు హామీ ఇచ్చారు. న్యాయవాదుల నుండి ఏదైనా సమస్యలు ఏర్పడితే తన దృష్టికి తీసుకురావాలని ఆయన న్యాయమూర్తులను కోరారు.
ఈ సందర్భంగా ఇరువురు న్యాయమూర్తులను బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు సాముల రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి చనగాని యాదగిరి, ఉపాధ్యక్షులు జక్కుల నాగేశ్వరరావు, మహిళా న్యాయవాదులు రేణుకా దేవి, తెప్పని శ్రీలక్ష్మి, మంత్రి ప్రగడ దీపిక, జుట్టుకొండ సంధ్య, పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు ఏజీపీలు, అడిషనల్ పీపీలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

