 
                                                            Rangareddy | మంచాల : రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి ఆత్మహత్య చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆరుట్ల గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నందిని (18), నాగరాజు గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా సోమవారం నందిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు నాగరాజు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు మంచాల పోలీస్ స్టేషన్ (police station) ముందు ధర్నాకు దిగారు. రోడ్డుపై బైఠాయించిన న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు నందిని ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలుసుకున్న నాగరాజు.. మండల పరిధిలోని ఆగపల్లిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
Also Read..
Karimnagar | కరీంనగర్లో భారీ అగ్నిప్రమాదం.. బట్టల షాపులో చెలరేగిన మంటలు
RS Praveen Kumar | జూబ్లీహిల్స్ నీ అయ్యా జాగీరా..? నవీన్ యాదవ్పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్
Lower Maneru | నిండు కుండలా ఎల్ఎండీ రిజర్వాయర్.. రెండు గేట్లు ఎత్తివేత
 
                            