Karimnagar | కరీంనగర్లో భారీ అగ్నిప్రమాదం.. బట్టల షాపులో చెలరేగిన మంటలు
Karimnagar | కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్ వద్ద బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కపిల డ్రస్సెస్ షోరూమ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.
Karimnagar | కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్ వద్ద బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కపిల డ్రస్సెస్ షోరూమ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో క్షణాల్లోనే పక్కనున్న షాపులకు కూడా మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో బట్టల దుకాణంతో పాటు వినాయక ఎంటర్ప్రైజెస్, ఫొటోగ్రఫి షాపు, కెనాన్ ఫొటోగ్రఫి దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. ఈ ప్రమాదం కారణంగా కపిల దుకాణం యాజమాన్యానికి భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

