Lower Maneru | తిమ్మాపూర్, అక్టోబర్ 29 : లోయర్ మానేరు జలాశయం మరోసారి నిండుకుండలా మారింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు మిడ్ మానేరు జలాశయంతో పాటు మోయతుమ్మెద వాగు నుండి వరద వస్తుండడంతో పూర్తి నీటిమట్టం స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటలకు ఎల్ఎండీ రిజర్వాయర్ ఇంజినీర్లు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు.
ఇన్ ఫ్లో పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది. 24 టీఎంసీల సామర్థ్యం గల ఎల్ఎండీ రిజర్వాయర్లో పూర్తి స్థాయి నీళ్లు ఉన్నాయి. గేట్లు ఓపెన్ చేసిన నేపథ్యంలో మానేరు వాగుకు సమీప ప్రాంతాల్లోని ప్రజలు, రైతులు, కాపరులు, మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.