BRS Leaders | రామచంద్రాపురం, ఆగస్టు 25 : తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ డబుల్ బెడ్రూంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకు భూమి ఆకాశం ఆర్ఫనేజ్ ట్రస్ట్ సహకారంతో, పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. అదేవిధంగా 8 రైటింగ్ బోర్డులు కూడా అందజేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు పలు సమస్యలు ఆదర్శ్ రెడ్డి దృష్టికి తీసుకువొచ్చారు. అధ్యాపకుల కొరత ఉందని విద్యార్థులు చెప్పడంతో సమస్యను పరిష్కరించేందుకు బీఆర్ఎస్ నాయకులు ముందుకు వచ్చారు.
ప్రభుత్వం నుండి టీచర్స్‌ను నియమించేవరకు బీఆర్ఎస్ యువ నాయకుడు సాయి చరణ్ గౌడ్ ముగ్గురు ప్రైవేట్ టీచర్స్‌ను, ఆదర్శ్ రెడ్డి ఒక్కరిని, మాజీ పీఏసీఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి ఒక్కరిని, మాజీ కౌన్సిలర్ ఉమేష్ ఒక టీచర్‌ను స్పాన్సర్ చేశారు. అలాగే బీఆర్ఎస్బీ అధ్యక్షుడు చెన్న రెడ్డి ఫర్నిచర్ కోసం రూ.50,000 అందిస్తామని హామీ ఇచ్చారు.
భవిష్యత్తులో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు..
ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ.. పేద విద్యార్థుల చదువు కోసం దాతలు ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు మా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాథోడ్, తెల్లాపూర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు ఉమేష్, బాబ్జీ, శ్రీశైలం రవీందర్ రెడ్డి, సాగర్,మాజీ పీఏసీఎస్ చైర్మన్ బూచి రెడ్డి, వైస్ ఛైర్మన్ మధు, బీఆర్ఎస్వీ పటాన్చెరు నియోజకవర్గ అధ్యక్షుడు చెన్నరెడ్డి, బీఆర్ఎస్ యూత్ నాయకులు సాయి చరణ్ గౌడ్, సాయి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, ఇంద్ర రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, డబుల్ బెడ్ రూం ఇంచార్జీలు అక్బర్ ఖాన్, రాజు, ఇమ్రాన్, షకీల్, లక్ష్మణ్, మోయిన్, కొల్లూరు ఫేజ్ 2 డిగ్నిటీ హౌసింగ్ సొసైటీ అడ్మిన్లు తదితరులు పాల్గొన్నారు.
GST Rates | నవరాత్రులకు ముందే.. అమల్లోకి కొత్త జీఎస్టీ పన్ను శ్లాబులు..!
Supreme Court: దివ్యాంగులపై జోకులు.. క్షమాపణలు చెప్పాలని యూట్యూబర్ రైనాకు సుప్రీం ఆదేశాలు
Daisy Shah | వాళ్లకి నడుము, బొడ్డు పిచ్చి ఉంది.. సౌత్ ఇండస్ట్రీపై నటి సంచలన వ్యాఖ్యలు