GST Rates | జీఎస్టీ సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జీఎస్టీలోని అత్యధిక పన్ను శ్లాబుల తొలగింపునకు ప్రతిపాదించింది. వస్తువులు, సేవల పన్ను (GST) విధానాన్ని సవరించాలన్న కేంద్రం ప్రతిపాదనలకు మంత్రుల బృందం (GoM) ఇటీవలే అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ కొత్త పన్ను రేట్లు నవరాత్రికి ముందే అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ సెప్టెంబర్ 22 నాటికి కొత్త జీఎస్టీ పన్ను శ్లాబులను అమలు చేస్తుందని ప్రభుత్వ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది.
జీఎస్టీలో ప్రస్తుతం 5, 12, 18, 28 శాతం పన్ను స్లాబులున్నాయి. మార్కెట్లోని దాదాపు అన్ని వస్తూత్పత్తులపై ఈ స్లాబుల ప్రకారమే పరోక్ష పన్నులు పడుతున్నాయి. అయితే, 5, 18శాతం స్లాబ్లను మాత్రమే కొనసాగించాలని, 12, 28 స్లాబ్లను తొలగించాలని కేంద్రం ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న నాలుగు స్లాబులను రెండింటి తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు ఆయా రాష్ర్టాల ఆర్థిక మంత్రులతో ఏర్పాటైన మంత్రుల బృందం అనుమతినిచ్చింది. దీంతో 12, 28 శాతం స్లాబులను ఎత్తివేసి కేవలం 5, 18 శాతం స్లాబులు మాత్రమే ఉండనున్నాయి. ఈ స్లాబుల కుదింపుపై వచ్చే నెల అంటే సెప్టెంబర్ 3 నుంచి 4 వరకు రెండు రోజులపాటు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కాబోతున్నది. ఈ సమావేశం తర్వాత కొత్త రేట్ల అమలుపై నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు సదరు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Also Read..
Parineeti Chopra | తల్లి కాబోతున్న స్టార్ నటి.. సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్
Duduma Waterfall | రీల్స్ చేస్తూ.. జలపాతంలో కొట్టుకుపోయిన యూట్యూబర్.. VIDEO
Amit Shah | గృహ నిర్బంధంలో జగదీప్ ధన్ఖడ్..? అమిత్ షా ఏమన్నారంటే