Parineeti Chopra | బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) దంపతులు గుడ్ న్యూస్ చెప్పారు. తాము త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నామంటూ (announce pregnancy) ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా వీరిద్దరూ స్పెషల్ పోస్ట్ పెట్టారు. ‘మా చిన్ని ప్రపంచం.. త్వరలో మా జీవితాల్లోకి రాబోతోంది’ అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు 1+1 = 3 అని ఉన్న ఫొటోను జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇది చూసిన పలువురు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, అభిమానులు పరిణీతి-రాఘవ్ చద్దా దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
2011లో ‘లేడీస్ వర్సెస్ రిక్కీ బాల్’ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది పరిణీతి చోప్రా. ప్రియాంక చోప్రా చెల్లెలుగా ఇండస్ట్రీకి పరిచయమైన పరిణీతి పలు హిట్ సినిమాల్లో నటించి అభిమానులను సంపాదించుకున్నది. ఆ తర్వాత ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాని ప్రేమ వివాహం చేసుకుంది. రాఘవ్-పరిణీతి వివాహం 2023 సెప్టెంబర్ 24వ తేదీన అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్‌పుర్‌లోని లీలా ప్యాలెస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
Also Read..
Duduma Waterfall | రీల్స్ చేస్తూ.. జలపాతంలో కొట్టుకుపోయిన యూట్యూబర్.. VIDEO
Amit Shah | గృహ నిర్బంధంలో జగదీప్ ధన్‌ఖడ్..? అమిత్ షా ఏమన్నారంటే
Mangaluru Dinesh | చిత్ర పరిశ్రమలో విషాదం.. కేజీఎఫ్ నటుడు కన్నుమూత