బల్కంపేట ఆలయ సిబ్బందిపై వేటు
బల్కంపేట ఎల్లమ్మ ఆలయ సిబ్బందిపై మంత్రి వేటు వేశారు. శుక్రవారం మ్రంతి కొండా సురేఖ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. పరిపాలనా వ్యవహారాలకు సంబంధించి అంశాల్లో లోపించిన స్పష్టతపై ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
- నలుగురు ఉద్యోగుల తొలగింపు
- ఆలయాన్ని తనిఖీ చేసిన మంత్రి కొండా సురేఖ
- దేవాలయ పరిపాలన గాడి తప్పిందని ఈవో, సూపరింటెండెంట్లపై ఆగ్రహం
అమీర్‌పేట్, ఫిబ్రవరి 27: బల్కంపేట ఎల్లమ్మ ఆలయ సిబ్బందిపై మంత్రి వేటు వేశారు. శుక్రవారం మ్రంతి కొండా సురేఖ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. పరిపాలనా వ్యవహారాలకు సంబంధించి అంశాల్లో లోపించిన స్పష్టతపై ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవ వివరాలకు, అధికారులు చూపుతున్న వివరాలకు మధ్య వ్యత్యాసం ఉండటంతో వెంటనే ఫైళ్లు స్వాధీనం చేసుకుని, అల్మారాలకు సీల్ వేయాలని దేవాదాయ శాఖ ఆర్జేసీ శ్రీనివాస్‌రావును ఆదేశించారు.
ఉద్యోగుల హాజరు పట్టిక కూడా అస్తవ్యస్తంగా మారిందని, మొత్తంగా దేవాలయ పరిపాలనా వ్యవస్థ గాడి తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ కంప్యూటర్ ఆపరేటర్ సహా, ముగ్గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు. దేవాలయం బయట ఉన్న షెడ్డును వెంటనే తొలగించాలని, ఎల్లమ్మ ఆలయానికి దాతగా వ్యవహారించిన దివంగత మాజీ సీఎం రోశయ్య పేరును పెట్టాలని సూచించారు.
అసంపూర్తిగా మిగిలిపోయిన పార్కింగ్ కాంప్లెక్స్‌ను సందర్శించిన మంత్రి సురేఖ అక్కడి నుంచే ఫోన్ ద్వారా డీఈతో మాట్లాడి వెంటనే కాంప్లెక్స్ నిర్మాణాలకు సంబంధించి పూర్తి నివేదికను పంపాలని ఆదేశించారు.
దేవాలయంలో చోటు చేసుకుంటున్న అవకతవకలపై టీపీసీసీ ఉపాధ్యక్షురాలు డాక్టర్ కోట నీలిమ మంత్రి సురేఖకు వివరించారు. ఆలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీసం ఈఎస్ఐ, ఈపీఎఫ్ వంటి ప్రాథమిక సదుపాయాలను కల్పించడంలో ఆలయ అధికారులు ఘోర వైఫల్యం చెందారన్నారు. ఆలయానికి చెందిన ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన అంశాల్లో స్పష్టత లోపిస్తోందని, దాతలు సమర్పించుకున్న ఖరీదైన చీరలు కాంట్రాక్ట్ పాడుకున్న వ్యక్తులకు కాకుండా అధికారులు వాటిని స్వాధీనం చేసుకుంటున్నారనే ఫిర్యాదులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎల్లమ్మ దేవాలయ నిర్వహణలో అకౌంటెంట్, సూపరింటెండెంట్, ఈవోలు దారుణంగా విపలమయ్యారన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

