Mangaluru Dinesh | చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. స్టార్ నటుడు మృతి చెందారు. సూపర్ హిట్ మూవీ కేజీఎఫ్ (KGF) సినిమాలో బాంబే డాన్ శెట్టి (Shetty) పాత్రలో నటించి మెప్పించిన కన్నడ నటుడు (Kannada actor) దినేష్ మంగళూరు (Mangaluru Dinesh) కన్నుమూశారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దినేష్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 63. ఈ విషయాన్ని దినేష్ కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. మంగళవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దినేష్ మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా, దినేష్ మంగళూరు నటుడిగానే కాకుండా దాదాపు 200 చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశారు. వీర మదకరి, చంద్రముఖి ప్రాణసకి, రాక్షస వంటి సినిమాల్లో ఆర్ట్ డైరెక్టర్గా గుర్తింపు పొందారు.
Also Read..
Priyadarshan | 41 ఏళ్ల క్రియేటివ్ ప్రయాణానికి ముగింపు .. అదే చివరి చిత్రం అని ప్రకటన
Tollywood | కూలీ, వార్ 2 చిత్రాలు ఆ చిన్న సినిమా ముందు తేలిపోయాయా.. ఇది కదా సక్సెస్ అంటే..
Pawan Kalyan | బాలకృష్ణకి ప్రత్యేక అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్.. కారణం ఏంటంటే..!