Tollywood | ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ నెలకొంది . పెద్ద హీరోలు, భారీ బడ్జెట్, గ్రాండియర్ సెట్లు, హైఎండ్ గ్రాఫిక్స్, పాన్ ఇండియా రిలీజ్‌లతో తెగ హంగామా చేస్తున్నారు. కానీ ఈ డిజైన్‌లో ఒక పెద్ద లోపం కనిపిస్తోంది, అదే “కథ”. సినిమాకు ప్రాణం కథే అయినా, ఈ మధ్యకాలంలో దాన్ని పక్కనబెట్టి మార్కెటింగ్ అండ్ మ్యాగ్నిట్యూడ్ మీదే ఫోకస్ పెరిగిపోతోంది. ఫలితంగా, వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలు కథ లేకపోవడంతో డిజాస్టర్‌గా మిగులుతున్నాయి. అదే సమయంలో మంచి కథతో రూపొందిన చిన్న సినిమాలు మాత్రం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆ కోవలోకే వస్తుంది సు ఫ్రమ్ సో.
సు ఫ్రమ్ సో , ఓ కన్నడ హారర్ కామెడీ చిత్రం కాగా, ఆగస్టు 8న విడుదలైన ఈ సినిమా తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. పెద్ద హైప్ లేకుండా రిలీజైనప్పటికీ, సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే బలమైన మౌత్ టాక్‌ను సంపాదించింది. కేవలం రూ.6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.35 కోట్లు వసూలు చేయడం గమనార్హం. అది కూడా ఎక్కువగా కన్నడ వెర్షన్ నుంచే. తెలుగులోనూ ఈ సినిమాకు భారీ స్పందన లభిస్తోంది. మూడు వారాలు దాటినా ఇంకా థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
వార్ 2 (ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబో) ,కూలీ (రజినీకాంత్ – నాగార్జున కాంబో) వంటి పాన్ ఇండియా బిగ్గీలను కూడా బాక్సాఫీస్ పరంగా పక్కకు నెట్టి సు ఫ్రమ్ సో చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. రెండు భారీ పాన్ ఇండియా చిత్రాల నడుమ విడుదలైన ఈ చిత్రం లాభాల బాట పట్టడం నిజంగా గొప్ప విషయం. సు ఫ్రమ్ సో సినిమా విషయానికి వస్తే.. జెపి తుమినాడ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జెపి తుమినాడ్, షనీల్ గౌతమ్, రాజ్ బి శెట్టి, ప్రకాష్ తుమినాడ్, సంధ్య అరకెరె లు కీలక పాత్రలు పోషించారు.అలాగే ఈ సినిమాని కన్నడలో శశిధర్ శెట్టి బరోడా, రవి రాయ్ కైలాస, రాజ్.బి. శెట్టి లు నిర్మించగా తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేసారు.. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో ఇది కదా అసలైన సక్సెస్ అంటే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.